శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0065 నామం : భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా
"ఓం ఐం హ్రీం శ్రీం భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః"
ఇది పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః” అని చెప్పాలి.
భండ + అసుర = 'భండుడు' అను రాక్షసుని యొక్క
వధ = సంహరించుట యందు,
ఉద్యుక్త = ప్రయత్నించు,
శక్తి = స్త్రీ దేవతల,
సేనా = సేనలతో,
సం (సమ్యక్) + అన్వితా = చక్కగా కూడియున్నది.
తన యొక్క వివిధ అంశలతో వుండే శక్తి సైన్యాలతో కూడుకుని, అమ్మవారు తన స్థూల స్వరూపంతో సాధించే దేవకార్యాలే - భండాసుర, మహిషాసురాదుల వధలు...
బండాసురుడు భూడిద నుండి పుట్టిన వాడు, శివుడు మన్మధుని దహించినప్పుడు మన్మథుడు భూడిద అయ్యారు . అప్పటినుండి మన్మథుడు డనంగుడైనాడు, ఆ భూడిద మన్మధుని శరీరము తో పాటు శివుని కోపము కూడా అందులో ఉన్నది. ఆ భూడిదను గణపతి చూసి ఆ భూడిదతో ఒక పురుషాకరాన్ని తయారు చేసేను ఆ ఆకరాన్ని చూసి బ్రహ్మ దేవుడు బండా బండా అన్నారు బండా అంటే ఆశ్చర్యం, రుద్రుడి కోపము కూడా కలిసినందు వల్ల రుద్ర స్వభావము కలిగి ఉన్నాడు, రాక్షసుడు అయ్యాడు, రుద్రుడి కోప శక్తిని వధించడం ఎవ్వరి వల్ల కాలేదు, సృష్టిని రక్షించుటకై అమ్మవారు అనంత శక్తిగా మారి ఒక సేనగా ఏర్పడి బండాసురుడు సంహరము చేసెను.
బండాసురుడు ముర్కుడు, అజ్ఞాని, అధిక క్రోధము, అహంకారము, సిగ్గు లేనివాడు. అట్టి లక్షణములు గల రాక్షసుడిని అమ్మవారు వదించారు.
మనలోని అజ్ఞాన భావాలకు ప్రతీకలే అసురులు. అలాగే మనలోని ప్రజ్ఞాన భావాలకు ప్రతీకలే దేవతలు. ఈ రెంటికీ మనలో ఎప్పుడూ సంఘర్షణే. అహంకార సంబంధమైనవి - అజ్ఞాన భావాలు; ఆత్మ సంబంధమైనవి - జ్ఞానభావాలు. ఈ రెంటి సంఘర్షణే దేవాసుర సంగ్రామాలు. ఈ సంఘర్షణలు అనే సంగ్రామాల్లో ఒక్కొక్కప్పుడు రెండింటి మూల నాయకులు గూడా రంగంలోకి దిగవలసి రావచ్చును.
దైవానుగ్రహము కోసమే కాదు మనిషి మనిషిగా జీవించుటకు గౌరవం పొందుటకు కూడా కొన్ని లక్షణాలు అవసరం, అహంకారము, కోపము, మొండితనం మనిషిలో ఆలోచనా శక్తిని విచక్షణ భావాన్ని తొలగిస్తుంది ప్రేమను తగ్గిస్తుంది అందువల్ల ఎందులోను అభివృద్ధి ఉండదు, ఎవరి ప్రేమ దక్కదు, మనలోని బండాసురుడు అనగా కోపము మూర్ఖత్వ గుణం, అమ్మవారి ని శరణు వేడిన వారికి ఆ తల్లి ఈ స్వభావాన్ని ధూరంచేసి మంచి ఆలోచన బుద్దిని ప్రసాదిస్తుంది.
'అజ్ఞానానికి మూలకారణము; మద, అహంకారాల స్వరూపము అయిన భండాసురుని వధించడానికి - జ్ఞాన సంపర్క భావాలకు ప్రతీకమైన శక్తిసేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన చైతన్య చిద్రూపిణి' అని ఈ నామానికి విపులమైన అర్ధం.
మంత్ర ప్రయోగ ఫలితం
ఈ మంత్రం భక్తితో నిత్యం 11 సార్లు జపిస్తే జ్ఞానం లభిస్తుంది. ధారణా శక్తి పెరుగుతుంది. ఈ మంత్రాన్ని 11 రోజులపాటు రోజూ 1000 సార్లు జపిస్తే ఎవరి సహాయం, అవసరం లేకుండా కోరిన ఉద్యోగం లేక సంపద పొందవచ్చును. నిత్యం వీలున్నపుడల్లా - ఈ మంత్రానుష్ఠానం చేసేవారికి కొండంత మానసిక శక్తి చేకూరుతుంది. కోపం తగ్గుతుంది. ఎంత క్లిష్టమైన పనినైనా ఇట్టే సాధించవచ్చు. ఈ మంత్రాన్ని పడుకోబోయే ముందు రోజూ 9 సార్లు జపిస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. దాని వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0066 నామం : సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation