శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0066 నామం : సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా
"ఓం ఐం హ్రీం శ్రీం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితాయై నమః "
ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు “సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితాయై నమః” అని చెప్పాలి. ఇది పదహారు అక్షరాల నామం. ఎనిమిది అక్షరాల భాగాలుగా, రెండుగా ఈ నామాన్ని విడగొట్టకూడదు.
సంపత్కరీ = సంపత్కరీ దేవి చేత,
సమారూఢ = చక్కగా అధిరోహింపబడి ,
సింధుర ప్రజ = ఏనుగుల సముదాయము చేత,
సేవితా = సేవింపబడినది .
భండాసురుని వధించడానికి ప్రబలమైన శక్తిసేన కావాలి. ఆ శక్తి సేన గజ, తురగ, రధాది బలాలుంటాయి. వాటిలో ముందుగా గజ బలం ఈ నామంలో చెప్పబడుతోంది.
గజ విద్యలో ఆరితేరిన వారే గజారూఢులు కాగలరు. గజాలను ముందు నడపగలరు, గజాల వలన పొందవలసిన సహాయము పొందగలరు. అమ్మవారి వద్ద 'సంపత్కరీ' అనే దేవి ఈ గజవిద్యలో మంచి ప్రావీణ్యము గలది. అమ్మవారి యొక్క 'అంకుశము' నుండి 'సంపత్కరీ దేవి’ పుట్టింది. అందుకే ఏనుగులకు, దేవి అంకుశము లాంటిది. ఈ దేవి 'రణకోలాహలం' అనే ఏనుగును అదిమి వుంటుంది. భద్ర, మంద్ర, మృగ గజాది జాతులకు సంబంధించిన అన్నీ రకాల ఏనుగులను ఈ దేవి మచ్చిక చేసుకోగలదు. వాటిని ఎక్కి నడిపించ గలదు. ఈ గజసేనతో సంపత్కరీ దేవి చేత అమ్మవారు సేవించబడుతుంది.
చిత్తానికి వృత్తులుంటాయి. సుఖ సంపత్తులతో కూడిన ఈ చిత్త వృత్తులను 'సంపత్కరీ' అనే పేరుతో సంకేతిస్తారు. శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రం వలన చిత్త వృత్తులు ఏర్పడతాయి. ఈ శబ్దాది విషయాలనే 'సింధుర ప్రజము అంటే' ఏనుగుల సముదాయముగా సంకేతిస్తారు. ఈ సంపత్కరీ దేవి ఈ సింధుర ప్రజాన్ని అదుపులో పెట్టి, వాటి ద్వారా ఉపయోగకరమైన పనుల చేయించి, శాశ్వత జ్ఞాన సముపార్జనకు, తద్వారా ఆనందానికి దారితీస్తుంది ('సంపత్కరీ' - అనే పేరులోనే, ఈ విషయం సూచన ప్రాయంగా వుంది.
సంపత్కరి ఊహకు అందని వైభవం కలది ఆమె అనుగ్రహించినచో సమస్త వైభవం ప్రాప్తిస్తుంది సృష్టి వైభవమునకు అధిపతి అయిన సంపత్కరి దేవి ఏడు లోకముల అంతరము గలదు వాటి నుండి ఏడు లోకములు వైభవములు ఏర్పడును, సంపదలన్నిటికి సంపత్కరి దేవి అధిపతి.
గజములు వైదిక సంకేతములు, తుష్టి పుష్టి కలిగించునవి గుఱ్ఱములు సిద్ధిని బుద్దిని కూడా ప్రసాదించి గలవు, మానవ శరీరమందు అవి చిత్తవృత్తులు గా పనిచేయును, చిత్తవృత్తుల బలమును గజ బలంగా ఋషులు గుర్తించారు. ఎంతటి బలవంతుడు అయినా మాయవలన చిత్త వృత్తులకు లోబడక తప్పదు, చిత్త వృత్తుల మునులకు అతర్ముఖములు, ఇతరులకు బహిర్ముఖములు ఇవి బీజప్రాయములై జన్మల తరబడి స్వభావ రూపమున వెంట వచ్చును ఇవియే వాసనలు ఇవి దగ్ధమైన నాడే యోగులకైనా సమాధిస్థితి కలుగును.
సంపత్కరీదేవి సృష్టియందు సమస్తమును ఇచ్చును ఙ్ఘనమును కూడా ఇచ్చును కానీ పరతత్వమునకు చేరుటకు ముందుగా ఆమె అనుగ్రహము కావలెను. పరతత్వము లలితాదేవి గాను యిహతత్వము సంపత్కరీ దేవి గాను, స్వభావములు (చిత్త వృత్తులు) గజ సమూహములు గాను తెలియ వలెను, వైభవములు కోరు వారు సంపత్కరిని, మోక్షమును కోరు వారు లలితా దేవిని ఉపాసించ వలెనని తంత్ర శాస్త్రము.
ఎక్కడ తాను ఉండాలో అక్కడ తాను లేకుండా పోతే, ఇక ఉన్న మిగిలినదంతా దారిద్య్రామే! అదొక్కటీ వున్నా సంపద వున్నట్లే! ఈ నామంతో అమ్మవారిని ధ్యానిస్తే ఇలాంటి సంపదనిచ్చే 'సంపత్కరిని' అనుగ్రహిస్తుంది .
ఈ నామానికి ఈ క్రింది అర్ధాలు చెప్పుకోవచ్చు.
1. సంపత్కరీ దేవి ఎక్కిన ఏనుగుల సముదాయముచే సేవింపబడేది.
2. చిత్తవృత్తులు - అనే ఏనుగులను అదుపులో పెట్టి, జ్ఞాన సముపార్జనకు దారితీసే వాటిచే సేవింపబడేది.
3. అసలైన సంపదను ప్రసాదించే వారిచే సేవింపబడేది.
మంత్ర ప్రయోగ ఫలితం
"ఓం ఐం హ్రీం శ్రీం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితాయై నమః"
ఈర్ష్య , అసూయాదుల వల్ల మాకు నిద్రపట్టడం లేదనేవారు ఈ కాలంలో ఎక్కువయ్యారు, ఇలాంటి దుర్గుణాలు తొలగడానికి ఈ మంత్రాన్ని నిత్యం 9 సార్లు జపించాలి. మనకి *దుఃఖం కలిగించని*, అవసరానికి సరిపడే సంపదలు కావాలని కోరేవారు అమ్మవారికి చక్కెరపొంగలి నైవేద్యం పెట్టి, ప్రతి శుక్రవారం 1000సార్లు జపిస్తే అటువంటి సంపదలు పొందుతారు. మోక్షం కావాలని కోరేవారు వీలున్నపుడల్లా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0067 నామం : అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation