శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0064 నామం : దేవర్షిగణసంఘాతస్తూయ మానాత్మవైభావా
"ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవాయై నమః"
ఇది పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు “దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవాయై నమః” అని చెప్పాలి.
దేవ = దేవతల యొక్క
ఋషి = ఋషుల యొక్క
గణ = గణదేవతల యొక్క
సంఘాత = సముదాయము చేత,
స్తూయమాన = స్తోత్రము చేయబడుచున్న,
ఆత్మ = తన యొక్క
వైభవా = గొప్పతనము గలది.
ఈ నామం దగ్గఱ నుండి అమ్మవారు చేసిన దేవకార్య వివరాలు చెప్పబడతాయి. 'బ్రహ్మాది దేవతలు, నారదాదిదేవ ఋషులు, వసిష్టాది ఋషులు ఆదిత్యాది గణములచే స్తుతింపబడు తన వైభవము గలది”. (భండాసుర వధార్థం వీరందరూ కలసి, సామూహికంగా, అమ్మవారి ఆవిర్భావ నిమిత్తం స్తుతించారు.) - అని ఒక అర్థం.
' ఏ స్తుతి అయినా, స్తోత్రమైనా మాటలతోనే గదా వుండేది, చేసేది. ఆ మాటలు అక్షరాలతో ఏర్పడతాయి. ఆ అక్షరాలు అచ్చులు, హల్లులతో ఏర్పడతాయి. అచ్చులు 16, హల్లులు 34 మొత్తం 50 అక్షరాలు (పంచాశత్). ఈ అక్షరాలే రకరకాలుగా రూపాలు మారుతూ ఎన్నో రకాల పదాలు వస్తాయి. ఈ పదాలలోనే ఏ స్తోత్రమైనా వుండేది. అందుకని -
16 అచ్చుల్ని - 'దేవగణం' అని, 34 హల్లుల్ని - 'ఋషిగణం' అని ప్రత్యేకంగా 'క్షకారాన్ని 'సంఘాత' అక్షరంగాను సంకేతిస్తే ఈ “దేవ, ఋ సంఘాత పదాలు సూచించే 50 అక్షరాల వివిధ కూర్పులతో స్తుతింపబడు వైభవము గలది” అని గూడా అర్థం చెప్పుకోవచ్చును.
దేవగణములు అయినా ఋషి గుణములు అయినా గ్రహములు, ప్రాణకోటి, ఆ తల్లి ఇచ్చా శక్తి నుండి వ్యక్తం అయిన వారే, అందరికి ఆధారమైన శక్తి అమ్మవారి అందరిని అనుగ్రహించవలసిన తల్లి ఆమే, ఆమె మయాలోనే అన్ని తెలుసుకోగలరు అన్ని తెలుసు అనుకున్న వారు కూడా ఆమె మయాలోనే జీవిస్తుంటారు..త్రిమూర్తులు సైతము జగన్మాత మాయకు లోబడి కార్యనిర్వహన జరుపుతుంటారు, ఆమనే స్తుతిస్తుంటారు. ఇచ్చ క్రియ ఙ్ఘనములు అమ్మవారి వైభవములు, అందువల్ల సత్సంకల్పము, ఙ్ఘనము బందింపని క్రియ జీవునకు కలుగవలెను అన్నా అమ్మవారిని ధ్యానించవలెను.
ఏ మాయ నందు ప్రాణకోటి లోబడు ఉన్నదో అట్టి మయాలోను ఆ తల్లిని అన్వేషించాలి, మాయ మోహము అమ్మవారి పరీక్ష కాలము. ధర్మమైన ప్రతి కార్యములో తానే గెలుపు రూపము, అన్యాయమైన ప్రతి కర్మ లో ఆమె దండన... ఇక్కడ రెండు ఆమె అయినప్పుడు చేడుని అపచ్చు కదా అనుకోవచ్చు, అప్పుడు అంతా సమానమైపోతారు, ఆలోచనా శక్తి ఆచరించే శక్తి, అమ్మవారు అనుగ్రహించి నప్పుడు నీవు నడిచే దారి నీవు నిర్ణయించు కోవాలి...అంటే గుప్త మైన ఆత్మ చిత్రముగా దాగి నీ పాప పుణ్యములను లెక్క కట్టి నీ తలరాతను నీచే రాయించ బడుతుంది.. ఆ మాయ స్వరూపము అమ్మవారు...
ఉదాహరణ కు ఒక తల్లికి ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురిని సమానంగానే చూస్తుంది ఎవరి పైన ప్రేమలో ఎక్కువ తక్కువ భావము ఉండదు అమాయకుడు గా ఉన్న బిడ్డ పైన మరింత బాధ్యతగా ఉంటారు కానీ వీడికి బుద్ధిమాంద్యం అని వదలరు, అందరి ఒకేలా చదివిస్తారు, ఒకేలాంటి సౌకర్యాలు కల్పిస్తారు కానీ అందరి జీవితం ఒకలాగ స్థిరపడదు కారణము వారి వారి బుద్ధి కుసలత, సాధన, వారి కర్మ వారి స్థాయిని నిర్ణయిస్తుంది.
అందువల్ల నీవు అనుభవిస్తున్న జీవితము నీవు రాసుకున్న తలరాత..ఎలా బతకాలి ఏవిధంగా ఉండాలి అని నిర్ణయించుకునే శక్తి నీ చేతిలోనే ఉంది.. ఆ పాప, పుణ్య కర్మలు అనుభవిస్తూ.. ఆ మాయ జీవితము అనుకోకూడదు అది కూడా మాయ అందులోనూ పరశక్తిని అణువణువునా దర్శించ గలిగితే... నీకు ఆ మాయ వశమవుతుంది.. అంటే అమ్మవారు ఆత్మ చైతన్య మార్గములో నడిపిస్తుంది.
మంత్ర ప్రయోగ ఫలితం
ఈ మంత్రాన్ని ఐశ్వర్య సంపత్కారణ మంత్రంగా మంత్రశాస్త్రం చెపుతోంది. 41 రోజుల పాటు రోజూ అమ్మవారి పటానికి ఎదురుగుండా కూర్చుని, పటిక బెల్లం నైవేద్యం పెట్టి, ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మవారి పాదాలకు కుంకుమతో పూజ చేసి పూజానంతరం పటిక బెల్లం ప్రసాదంగా స్వీకరిస్తే, అధికారం సంపద రెండూ లభిస్తాయి. ఇలా 108 రోజులు జపిస్తే రాజకీయాధికారం లభిస్తుంది. ఇలా సంవత్సరం జపిస్తే " సంపదతో పాటు ఆనందం, నిశ్చింత, పరమ మానసిక శాంతి లభిస్తాయి. కుటుంబం సుఖంగా ఉంటుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0065 నామం : భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation