శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0064 నామం : దేవర్షిగణసంఘాతస్తూయ మానాత్మవైభావా
"ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవాయై నమః"
భాష్యం
దేవగణములచేత, బుషిగణములచేత కొనియాబడుచున్నది. స్తుతింపబడుచున్నది.
ఆత్మస్వరూపవైభవం కలది. దేవబుషిగణములచే అనేకవిధములుగా పొగడబడుచున్న ఆత్మవైభవము గలది. సంఘాతము అంటే నరకము. అటువంటి నరకం నుంచి తప్పించమని దేవగణాలు, బుషిగణాలు ఆ దేవిని ప్రార్థిస్తున్నాయి. ఘాతము అంటే సంహరించటం. భండాసురసంహారం చెయ్యమని ఆ గణాలు దేవిని ప్రార్ధిస్తున్నాయి.
భండాసురుడు దేవతలను ఓడించాడు. వారిని రాజ్యభ్రష్టులుగావించాడు. యజ్ఞయాగాదులు పాడుచేస్తున్నాడు. బుషులను బాధిస్తున్నాడు. అప్పుడు వారంతా పరమేశ్వరిని ప్రార్థించి
యది తుష్టాసి కల్యాణి! వయం దైత్యేంద్ర పీడితాః
దుర్లభం జీవితం చాపి త్వాం గతా శరణార్థినః
ఓ పరమేశ్వరీ! నువ్వు మా పై దయ చూపదలచినట్లెతే మమ్ములను రక్షించు. మేము ఆ రాక్షసుని చేతిలో పీడించబడి నిన్ను శరణుకోరుతున్నాము అన్నారు. అప్పుడు నారదుడు అవును తల్లీ ఆ రాక్షసుడు నీ చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ చావడు అన్నాడు. ఇక్కడ సంఘాతము అంటే నారదాది దేవవర్గులు అని అర్ధం. వీరు బ్రహ్మాదిదేవతలు, వసిష్టాది బుషులు, నారదాదులు అని చెప్పబడింది. కాని అగ్నిపురాణంలో
ఆదిత్యా విశ్వవసవ స్తుషితా భాస్వరా నిలాః
మహారాజితి సాధ్యా శ్చ రుద్రా శ్చ గణదేవతాః ॥
మహారాజులు 7 మంది
వసువులు 8 మంది
రుద్రులు - 11 మంది
విశ్వదేవతలు - 10 మంది
సాధ్యులు 12 మంది
సూర్యులు = 12 మంది
తుషితులు 36 మంది
అనిలులు 49 మంది
భాస్వరులు గా 64 మంది
మొత్తం దేవగణాలు 209 మంది
రుద్రయామళంలో దిక్పాలకులచేత ఇతర దేవతలచేత పొగడబడినది. అని చెప్పబడింది.
సమస్తలోకానికి ప్రేమాస్పదమైన చైతన్యమే ఆత్మ. ఆత్మయే పరమేశ్వరి
దేవగణాలు అచ్చులు 16
బుషిగణాలు హల్లులు 34
సంఘాతము క్ష కారము 1
మొత్తం అక్షరాలు 51
అఇఉబుఏఐఓజెఅంఅః - 11 అచ్చులు
కచటతపయ శ వర్గులు - 33 హల్లులు
సంఘాతాక్షరము 1
మొత్తం అక్షరాలు 45
ఇది భూమావిద్య. సంఖ్యాశాస్త్రం ప్రకారము భూ అంటే - 4, మ అంటే - 5. కాబట్టి దేవి భూ, మా విద్యచే స్తుతింపబడినది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below