లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0063 నామం : కామదాయినీ
కామదాయినీ : భక్తుల కోరికలను నెరవేర్చు తల్లికి నమస్కారము
(కామ= పరమేశ్వరుని; దాయిని= తన ఆస్తిగా కలిగినది అని ఇంకొక అర్థం).
Kaamadaayinee : She who gives what is wished. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0063 నామం : కామదాయినీ
కామదాయినీ : భక్తుల కోరికలను నెరవేర్చు తల్లికి నమస్కారము
(కామ= పరమేశ్వరుని; దాయిని= తన ఆస్తిగా కలిగినది అని ఇంకొక అర్థం).
Kaamadaayinee : She who gives what is wished. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0063 నామం : కామదాయినీ
"ఓం ఐం హ్రీం శ్రీం కామదాయిన్యై నమః"
ఇది ఐదు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు 'కామదాయిన్యై నమః' అని చెప్పాలి.
కామ = కోరికలను,
దాయినీ = ఇచ్చునది (నెరవేర్చునది)
కామములు అంటే కోరికలు కాబట్టి
1) భక్తుల కోరికలను నెఱవేర్చునది అని ఒక అర్థం. కామ అంటే 'కామేశ్వరుడు' అని అర్థం కాబట్టి, 'కామేశ్వరుని ఇచ్చునది', అని
2) శివ ప్రాప్తి కలుగజేయునది అని ఇంకొక అర్థం. 'దాయము' అంటే 'ఆస్తి' అనే అర్థాన్ని బట్టి
3) 'కామేశ్వరునే తన ఆస్తిగా గలది' అనే అర్థం కూడా చెప్పుకోవచ్చును. అమ్మవారికి వరదముద్ర లేకపోయినా ఈ నామమే ఆ ముద్రను తెలియచేస్తుంది.
శ్రీ దేవిని సేవించువారికి సకల కోరికలు ఆమె తీరుస్తుంది. శివుని వ్యక్త రూపాన్ని శివ సాయుజ్యామును కూడా ప్రసాదించ గలదు, ఇహపర ములను అందించగల తల్లి, నమ్మి కొలిచే భక్తులకు వారి అభిష్టమును నెరవేర్చ గలదు. కామధ + అయిని అని పలుకటలో సమస్త కోరికలను పరిత్రుప్తికి అమ్మాయే శుభమగు వాహిని అర్దం. ఆమె సర్వకామప్రద. భక్తితో సేవించు వారికి వర ప్రదాత బ్రహ్మ సహితము ఆమెను ప్రార్థించి ఇచ్చా శక్తిని కిలిగి సృష్టిని నిర్వహించు చున్నారు. ఇచ్చాశక్తి, క్రియశక్తి, ఙ్ఘనశక్తి, ఆ తల్లే కావడం వల్ల. మంచి ఆలోచనా శక్తి ఆ ఆలోచన నెరవేర్చే శక్తి ఆ జగన్మాత, మనోబుద్ది అహంకార రూపం కూడా ఆమె.. మనలో ఎటు వంటి ఆలోచనకు కోరికలకు తావు ఇస్తామో అటువైపుకు నిన్ను నడిపించగలదు అను చెప్తూనే.. ఇంకో వైపు శివకామేశ్వరుడిని కూడా వశం చేయగల శక్తి ఆమె అని తెలియ చేస్తున్నది...
శివున్ని సాన్నిద్యం అత్యంత దుర్లభం అట్టి స్థితిని అనుగ్రహించగల శక్తి మీకు తుశ్చమైన కోరికలు కూడా నెరవేర్చ గలదు. ఇప్పుడు మన బుద్ధికి ఏది కావాలో నిర్ణయించుకోగల శక్తిని ఎటు వైపు పయనించాలో అని నిర్ణయించే శక్తి కూడా ఆమె మనకు ప్రసాదించింది... కనుక ఆత్మ చైతన్య మార్గంలో పయనించి పరంధాముని చేరుకుందామ లేక బాహ్య సుఖాలు చిల్లర కొరికాలతోనే జన్మను వర్ధ్యం చేసుకుందామో అది కూడా మనమే నిర్ణయించుకొని ఆ తల్లిని ఆశ్రయిద్దాము...
పుణ్యము చేసుకున్న వారు పుణ్య లోకాలకు వెళ్తాడు, పాపం చేసుకున్న వారు పాపలోకములో అనుభవిస్తారు... ఈ పుణ్యము పాపము కూడా నశించిన వారు మటుకే పరంధామునిలో చేరుకోగల మోక్ష స్థితిని పొందగలరు.. ఎందుకు అంటే ఆ పరంజోతిలో నుండి వెలువడినప్పుడు పుణ్యము, పాపము అంటూ ఏ గుణము లేని నిర్వికార నిర్గుణ స్థితి నుండి వస్తుంది తిరిగి చేరుకునే సమయంలో అట్టి స్థితిని పొందిన వారే ఆ మోక్షమును చేరుకోగలరు... విషయ వాంఛలు, అదే వాసన గల జన్మకు కారణము అవుతుంది అదే జన్మ చక్రంలో తిరుగుతూ కర్మ ను అనుభవిస్తూనే ఉంటుంది... అట్టి స్థితి నుండి నిన్ను శివుని సానిద్యాన్ని కూడా ఇవ్వగల తల్లి మనకు ఉన్నది ఆమెను ఆశ్రయిద్దాము..
మంత్ర ప్రయోగ ఫలితం
చిత్రరథుడనే గంధర్వుడు తన భార్య విద్యాధరితో హిమాలయాలలో విహరిస్తుండగా, అతని భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకు పోయాడు. అప్పుడాతడు ఈ మంత్ర జపంచేయగా ఆ తల్లి వాడిని సంహరించి తిరిగి అతని భార్యను అతనికి అప్పగించింది అని పురాణగాధ. ఈ మంత్రం 9 రోజులపాటు భక్తితో మూడుపూటలా అనగా ఉదయం 6 గంటలకు మధ్యాహ్నం 12 గం.లకు, సాయంత్రం 6 గం.లకు చొప్పున పూటకు 316 సంఖ్య చొప్పున జపం చేస్తే తొందరగా వివాహం అవుతుంది. రోజూ 108 చొప్పున 40 రోజులు “ఓం కామదాయిన్యై నమః" అనే మంత్ర జపం చేస్తే ఉద్యోగం లభిస్తుంది. సంతానాభివృద్ధికి ఈ మంత్రాన్ని నిత్యం యథాశక్తి పారాయణ చేయడం మంచిది. అనుకూల దాంపత్యం కొరకు మంత్రం 11 రోజుల పాటు రోజూ 300 సార్లు పారాయణ చేయడం మంచిది.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0064 నామం : దేవర్షిగణసంఘాతస్తూయ మానాత్మవైభావా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత