లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0063 నామం : కామదాయినీ
కామదాయినీ : భక్తుల కోరికలను నెరవేర్చు తల్లికి నమస్కారము
(కామ= పరమేశ్వరుని; దాయిని= తన ఆస్తిగా కలిగినది అని ఇంకొక అర్థం).
Kaamadaayinee : She who gives what is wished. Salutations to the mother.

శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0063 నామం : కామదాయినీ
"ఓం ఐం హ్రీం శ్రీం కామదాయిన్యై నమః"
భాష్యం
మన్మథుణ్ణి సంహరించినవాడు శివుడు. అతడి చేత శుభములను పొందినది.
కామ అంటే శివుడు. దాయని అంటే వంశపారంపర్యసంబంధముగలది. అనగా శివుడికన్న వేరైనది కాదు. శివునితో ఏకమై ఉండునది.
సమస్త భక్తకోటికి వారి కోరికలు తీర్చునది. భక్తుల అర్హతలను బట్టి వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు, మోక్షము ప్రసాదించునది.
భక్తులకు కామేశ్వరుని ప్రాపు కలుగుచేయునది. అంటే నిరాకారుడు, నిర్గుణస్వరూపుడు, మాయారహితుడు అయిన పరమేశ్వరుణ్ణి గురించి తెలియచేసేది.
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below