శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0062 నామం : కామాక్షీ
"ఓం ఐం హ్రీం శ్రీం కామాక్ష్యై నమః"
ఇది మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నన్ను నపుడు "కామాక్ష్యై నమః” అని చెప్పాలి.
కామ = అందమైన;
అక్షి = కన్నులు గలది.
“కామ” అనే పదానికి కమనీయమైన, అంటే - 'అందమైన' అనే అర్థమే కాకుండా 'కామేశ్వరుడు' అని, 'మన్మథుడు' అనీ గూడా అర్థాలు వున్నాయి. సృష్టి సంకల్పం కలిగి, తాను సృష్టిగా అవ్వాలనే నిండు కోరిక (కామం)తో వున్న శివుని వ్యక్త స్వరూపాన్ని "కామాక్షి'తో సంకేతిస్తారు.
క - బ్రహ్మ సంబంధమైన సరస్వతిని, మ - విష్ణు సంబంధమైన లక్ష్మిని సూచిస్తాయి. కాబట్టి, కామాక్షి అంటే 'సరస్వతీ' ‘లక్ష్మీలను తన కన్నులుగా గలది అనే అర్థం వస్తుంది. కాంచీపుర పీఠానికి అధిదేవత అని గూడా అర్థం.
కామక్షి కన్నులు అత్యంత ఆకర్షణీయమైనవి ,కన్నులతోనే ఈ సృష్టిని పాలించగల తల్లి ఆమె కన్నుల నుండి ప్రసరించి అనుగ్రహముతో జీవులు తరిస్తారు..సకల కామితాలకు అధిష్టాన దేవత అయిన కామేశ్వరుడిని పతిగా కలిగిన మన కన్న తల్లి. ఇక్కడ కామము అనగా కోరిక సృష్టి చేయాలన్న కోరిక తననుండి సృష్టి చేయాలి అన్న సంకల్పము కలిగిన తల్లి తన చల్లిని చూపులతోనే ఈ సృష్టిని సృష్టించింది.
భక్తుని యందు ఈ కామము కన్యత్వమునకు చెందినది అంటే స్వచ్ఛమైనది. ఆలోచన, స్వచ్ఛముగాను మనసు పవిత్రముగాను, ఉంచుకొని స్వచ్ఛమైన భక్తితో ఎవరైతే తల్లి ని ఆరాదిస్తారో అట్టివారి న్యాయమైన కోరికలు తన చల్లి ని చూపులతోనే అనుగ్రహించ గలదు. భక్తుని యందు ఈ కామము కన్యత్వమునకు సంకేతముగా ఉండవలెను అన్నాము కదా దీని అర్థము ఉపాసకుని హృదయం ఎప్పుడూ బ్రహ్మచర్యము పాటించవలెను ఆలోచన నియంత్రణ శక్తి కలగాలి, మోక్షముని పొందాలి అన్న స్వచ్ఛమైన కామముతో (కోరికతో)నిండిపోవాలి. మనస్సు యొక్క చంచలమైన స్వభావాన్ని నియంత్రించుకోవాలి, ధర్మ బద్ధమైన కామము గృహస్థు ధర్మము యొక్క కర్తవ్యం. అయితే వారి కోరిక అనేది సమంజసముగా ఉండాలి, మన కర్మలను ఆపకూడదు అందులో అధర్మము ఉండకూడదు. అట్టి భక్తునికి ఆ తల్లి తన నేత్రాలలోనే లక్ష్మీ సరస్వతి నివాసము గల తల్లి చూపులతో అనుగ్రహిస్తుంది అనగా విద్యా, వివేకము, సంపదతో కటాక్షిస్తుంది.
ఆ తల్లి చూపు మనపైన ప్రసరించేలా మనము కోరుకోవాలి ఆమె ఆనుగ్రహంతో మన సంకల్పము నెరవేర్చు కోవాలి. కామక్షి అంటే ఇక్కడ కంచికి పీఠాధిపతి అని కూడా ఒక అర్థము వస్తున్నది అవును ఆ తల్లి పెద్ద పీఠాధిపతి. లక్ష్మీ సరస్వతులను కన్నులుగా కలిగిన తల్లి, సకల కామితాలను నెరవేర్చగల తల్లి భక్తుని హృదయము అను పీఠానికి అధిపతి. హృదయ పీఠం లో అమ్మవారిని ప్రతిష్టించు కున్న భక్తులను ఆ తల్లి ఎన్నడూ వీడదు వారి వెంటే పయనిస్తుంది. అట్టి భక్తులు కదిలే కామక్షి స్వరూపాలు అవుతారు.
భక్తులు యొక్క విద్యార్థి దశ నుండి ఉపాధి దశవరకు మోక్షమునకు కారణమైన స్వరూపము కామాక్షి స్వరూపము. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్ధాలు చెప్పుకోవచ్చును.
1) కమనీయమైన కన్నులు గలది.
2) కామేశ్వరుని తన కన్నులుగా గలది.
3) మన్మథుని తన కన్నులుగా గలది.
4) సృష్టిగా తాను మారవలెననే నిండు కోరికతో వుండే శివుని వ్యక్తస్వరూపము.
5) లక్ష్మీ సరస్వతులను తన కన్నులుగా గలది.
6) కాంచీపుర పీఠాధిపతి.
మంత్ర ప్రయోగ ఫలితం
ఈ మంత్రాన్ని రోజూ భక్తితో 108 సార్లు జపిస్తే పిల్లలకు విద్యాబుద్ధులు సమ కూరుతాయి. కొన్ని భయంకర జాతకదోషాల వల్ల పెళ్ళి కాక బాధపడేవారు, ప్రతి శుక్రవారం అమ్మవారి పటానికి పాయసం నివేదనచేసి, ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించి, ఆ పాయసాన్ని ప్రసాదంగా తాను తన కుటుంబసభ్యులు స్వీకరించి, ఒక్క పూట భోజనం మాత్రమే చేసి, రాత్రికి భూమిపై శయనం అనగా చాపపై నిద్రించే వారికి 6 నెలలో వివాహం అయితీరుతుంది. తీరని కోరికలు తీరడానికి 41 రోజులు అమ్మవారి ఏ గుడిలోనైనా ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కార్యసిద్ధి అవుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0063 నామం : కామదాయినీ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation