శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0062 నామం : కామాక్షీ
"ఓం ఐం హ్రీం శ్రీం కామాక్ష్యై నమః"
భాష్యం
కామే కమనీయే అక్షణీ యస్యాః సా
ఇంపైన కనులు గలది.
కామేశ్వర ఏవనేత్రం యస్యాః సా
శివుడు లేక కామేశ్వరుడు నేత్రములుగా గలది. దేవి యొక్క రెండుకనులూ ఆ పరమేశ్వరుడే అని భావన.
సప్తశతిలో నయన త్రియం జజ్ఞౌతథాపాపక తేజసా.
అగ్ని యొక్క తేజస్సుతో ఆమె మూడు కనులు ఆవిర్భవించినాయి. కమనీయమైన నేత్రములు గలది.
సూర్యచంద్రులే దేవి నేత్రాలు. పురుషసూక్తంలో చక్షో సూర్యోఅజాయత పరమేశ్వరుని నేత్రములు సూర్యుని తేజస్సుతో ఉన్నాయి అన్నారు. ఇదే మాటను ఉపనిషత్తులలో కూడా చెప్పటం జరిగింది. నేత్రాలకు అధిదేవత సూర్యుడు.
కామాక్షి కాముని అక్షిగా గలది. కాముడు అంటే మన్మథుడు. మన్మథుడే నేత్రములుగా గలది. జీవజాలము యొక్క కోరికలే నేత్రములుగా గలది. పూర్వజన్మలోని కోరికలననుసరించి ఈ జన్మలో వారి మనోవృత్తులను నెరవేర్చునది.
క అంటే - సరస్వతి. మ అంటే - లక్ష్మి కాబట్టి కామాక్షి - లక్ష్మీ సరస్వతులే నేత్రములుగా గలది. అష్టాదశశక్తి పీఠాలలో ఒక దేవత. కాంచీపురవాసి.
లంకాయాం శాంకరీ దేవీ
కామాక్షీ కంచికాపురీ
ప్రద్యుమ్న సింహలా దేవీ చాముండే క్రమపట్టణే
అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపుర్యాం మహాలక్ష్మీ ముహుర్యాం ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠాయాం పురుహూతికా
ఓడ్యానే గిరిజాదేవీ మాణిక్యా చిత్రకూటకే
హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయాయాం సర్వమంగళా
వారణాస్యాం విశాలాక్షీ కాశ్మీీరేచ సరస్వతీ
ఏతానిశక్తినామాని సాయంప్రాతః స్మరే న్నరః
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి
ఈ మొత్తం పీఠాలలో ఎక్కువభాగం (5) ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. కామాక్షీ స్తోత్రంలో దేవిని కీర్తిస్తూ శంకర భగవత్పాదులవారు
వందే శంకరభూషణీం గుణమయీం సౌందర్యముద్రామణీం
వందే రత్నవిభూషణీం గుణమణిం చింతామణిం సద్గుణామ్ ।
వందే రాక్షసగర్వసంహరకరీం వందే జగద్ర్రక్షిణీం
కామాక్షీం కరుణాకటాక్ష విభవీ మంగీకరీ పాహి మామ్ ॥
సర్వజ్ఞా సాక్షిభావేన తత్త త్కామా నపూరయత్
తం దృష్ట్వా చరితం దేవ్యా బ్రహ్మలోకపితామహః
కామాక్షీతి తదునామ దదౌ కామేశ్వరీ
సర్వజ్ఞురాలు, సాక్షీభూతురాలు అయిన దేవి అందరి కోరికలు తీర్చటం చేత బ్రహ్మ ఆమెను కామేశ్వరి, కామాక్షి అనే పేర్లతో పిలిచాడు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below