శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0059 నామం : మహాపద్మాటవీ సంస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీసంస్థాయై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "మహాపద్మాటవీసంస్థాయై నమః" అని చెప్పాలి.
మహత్ = మహిమగల లేదా గొప్పవైన
పద్మ = పద్మములు గల
అటవీ = అడవియందు
సంస్థా = చక్కగా ఉన్నది.
సూర్యుని తేజస్సుకు పద్మాలు వికసిస్తాయి శుక్రము యొక్క సూక్ష్మ స్థితిలో వుండే ధాతువులనే- ఓజస్సు, సహస్సు, భాజస్సు, తేజస్సులు - అంటారు. సుషుమ్న మార్గం ద్వారా ఊర్ధ్వ గతిలో పోయే కుండలిని శక్తీ అంటే ఈ తేజస్సే! సుషుమ్నా మార్గం ద్వారా ఈ తేజస్సు పైకి పోతున్నప్పుడు - మార్గమధ్యమంలో ఉండే మూలాధారాది షట్చక్రాలను స్పృశిస్తూ, చివరకు సహస్రారం చేరుతుంది. అక్కడ నుండి అమ్మ వారి పాదాల ద్వారా స్రవింపబడే అమృతధారలు - సుషుమ్నా మార్గం ద్వారా క్రిందికి వస్తూ - షట్చక్రాలను స్పృశిస్తూ తడుపుతాయి. అప్పుడు ఈ చక్రాలు పద్మాలలాగ వికసం చెందుతాయి. అందువల్ల షట్చక్రాలను షట్ పద్మాలని కూడా అంటారు. వీటికి పైన ఉన్న సహస్రారాన్ని మహా పద్మమని అంటారు. ఈ మహాపద్మం తో కూడుకుని ఉన్న షట్ పద్మమార్గాన్ని 'మహాపద్మాటవీ' అంటారు. ఈ మహాపద్మాటవీలోనే ఎప్పుడు పైకి క్రిందికి చరిస్తూ ఉంటూ - సహస్రార పద్మంలో అయ్యవారితో కూడి సుస్థిర ఆనందాన్ని చేకూరుస్తుంది కాబట్టి మహా పద్మాటవీ సంస్థా అనే నామం అమ్మవారికి సార్థకమైంది . సౌందర్యలహరిలోని "తటిల్లేఖాతన్వీమ్ ..... ఆనందలహరీం" అనే 21వ శ్లోకాన్ని ఇక్కడ సమన్వయము చేసుకోవాలి.
అనేకానేక మహత్తరములైన పద్మములు గల అడవిలో నుండునది అని అర్థము. శరీరమే మహా పద్మముల అడవి. అందలి షట్చక్రములు మహత్తరమైన పద్మములు. అవి కాక అనేక సహస్ర సంఖ్యాకములగు నాడులు కూడా మహా పద్మములే. షట్చక్ర పద్మములను, నాడి పద్మములను అధిష్టించి సహస్రార పద్మమున్నది. మొత్తము పద్మముల అడవికి సహస్రదళ పద్మమే అధిష్టాన పద్మము. దానికి పైన వేయు దళములు గల కులపద్మము అధోముఖముపై విలసిల్లి యున్నది. దానిపై దేవి యుండును. కులపద్మము బ్రహ్మాండ పద్మం. సహస్రార పద్మము పిండాండ పద్మము. పిండాండమును, బ్రహ్మాండమును అధిష్టించియున్న ప్రజ్ఞ శ్రీదేవి. ఈ రెండు అండముల యందు అసంఖ్యములగు పద్మములు కలవు. పద్మములు అనగా ప్రజ్ఞా కేంద్రములు. అసంఖ్యాకమగు పద్మములతో కూడిన పిండాండ బ్రహ్మాండములే మహాపద్మాటవీ. దానిని అధిష్టించి అమ్మ ఉన్నది.
ఇది జాగర్తగా గమనిస్తే కుండలిని సాధన లోని రహస్యం ఇక్కడ వివరంగా ఉంది. అమ్మవారి పాదాల నుండి వచ్చే అమృతం అంటే మనము క్రియా యోగం ద్వారా సాధన చేసే, కేచరి సాంభవి ముద్రలకు సంబందించిన సాధనా రహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి, ధ్యానం లో కుండలిని సాహస్త్రరం చెరు కోవడం అంటే ఆత్మ పరిపూర్ణముగా చైతన్య మార్గంలో ప్రయాణం చేయడం
ఈ మధ్య కాలంలో చాలా మంది శ్రీ విద్యా సాధకులు అమ్మవారి ఉపాసన కొన్ని సంవత్సరాలుగా సాధన చేస్తున్నాము, శ్రీ చక్ర నవావరణ పూజ చేస్తున్నాము మాకు అమ్మవారి అనుగ్రహం కలగడం లేదు అని అంటున్నారు అమ్మవారి అనుగ్రహము కలగలేదు అనేది చాలా తప్పు మాట అది అపోహ అమ్మవారి అనుగ్రహము ఉంది కాబట్టే మీరు క్షేమంగా ఆరోగ్యంగా చేయగలుగుతున్నారు మీ కుటుంబానికి ఆమె అండగా ఉంది కాబట్టే చేయగలుగు తున్నారు. అయితే అమ్మవారిని తెలుసుకోవాలి అనుకుంటే పూజ అర్చన అభేషేకం మంత్ర జపం ఇవన్నీటి కన్నా ముఖ్యంగా ధ్యానం చేయాలి నీలో నువ్వు అంతర్ లీనంగా ప్రయాణం చేయాలి.. క్రియాయోగం తో కుండలిని సాధన చేయాలి, చక్రాలు శుద్ధి చేసుకోవాలి అప్పుడే పూర్తి స్థాయిలో అమ్మవారి దర్శనం మీకు మీ సాహస్త్రరం లో లభిస్తుంది మీ వాక్కు శాసనం అవుతుంది మీరు కదిలే కామక్షి స్వరూపం అవుతారు... సాధన మొదలు పెట్టె ముందు అందరికి అదే సంకల్పము ఉంటుంది అయితే అది సాధనలో ఉండడం లేదు ఎలా సాధన చేయాలి అన్న పరిపూర్ణజ్ఞానం ఉంటే ఇది సులభమైన మార్గమే మంత్రం అయితే ఎక్కడో ఒక ఉపదేశం పొందుతున్నారు కానీ సాధనలో చాలా మందికి మార్గదర్శనం లభించడం లేదు, కొన్ని మూల మంత్రాలను ఎలా అయితే సంపుటి కరణం చేస్తామో అలానే ఇక్కడ మంత్రాన్ని ధ్యానాన్ని సంపుటికరణ చేయాలి ఇదే అసలైన సాధన... ఇది ప్రయత్నం చేస్తే ఆ తల్లి దర్శనం కచ్చితంగా అవుతుంది. పూర్తి స్థాయి లో మంత్ర సిద్ది లభిస్తుంది...
ఈ నామాన్ని జపించడం వల్ల మంచి ఙ్ఘపక శక్తి, వివేకము లభిస్తుంది..
మొత్తం మీద ఈ నామానికి షట్చక్ర పద్మాటవీ యందు ఉండునది, మాహా పద్మమైన సహస్రారము నందు ఉండునది అని అర్థాలు చెప్పుకోవచ్చును
మంత్ర ప్రయోగ ఫలితం
ఇంత విశిష్టత ఉన్న ఈ మంత్రాన్ని ప్రతి బుధ, శుక్ర వారాలలో, దర్భాసనం పై కూర్చుని 1008 సార్లు జపిస్తే అంతులేని ఆదాయం లభిస్తుంది. విద్యాభివృద్ధికి ప్రతి పంచమి నాడు 1008 సార్లు జపించాలి. ఋణ విముక్తికి మంగళ శుక్ర వారాలు ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించాలి యోగశక్తికి నిత్యం యధాశక్తిగా జపించడం మంచిది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0060 నామం : కదంబవనవాసినీ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation