శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0059 నామం : మహాపద్మాటవీ సంస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీసంస్థాయై నమః"
భాష్యం
మహా అంటే గొప్పదైన పద్మము. రుద్రయామళంలో ఊర్ధ్వం త్రిలక్షయోజనా యామ మహాపద్మవనామృతంపైన అంటే బ్రహ్మాండానికి పైభాగంలో మూడులక్షల యోజనాల విస్తీర్ణంగల మహాపద్మము ఒకటున్నది. లలితాస్తవరత్నంలో
మణిసదన సాలయో రధిమధ్యం దశతాలభూమిరుహసువర్ణదీరైః ॥
పర్ణయిః వర్డై ర్యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగైః
మృదులైస్తాలీపంచకమానైర్మిలితాం చ కేసర కదంబైః
సంతతగళిత మరంద ప్రోతోనిర్యన్మిలిందసందోహమ్
పాటీరపవన బాలకధాటీ నిర్యత్సరాగ పింజరితాం
పద్మాటవీం భజామః పరిమళకల్లోలపక్ష్మలోపాన్తిిమ్
చింతామణుల గృహము. ప్రాకారముల ఆదిమధ్యలయందు పదితాడిచెట్ల పొడవు గలవి. మేఘవర్ణము గల ఆకులు గలవి. యోజనము ఎత్తు గలవి. బలమైన కాండములు గలవి. ఐదు తాడిచెట్ల పొడవు గల కింజిల్మముల గుంపుగలవి. ఎల్లకాలము ప్రవించు మకరందప్రవాహము గలవి. మంచి గంధపువాసన గలవి. గాలికి కదలటంచేత బయటకు ఎగిరి వచ్చిన పుప్పొడితో కలసి పసుపురంగులో కనిపిస్తున్న పద్మములతో కూడిన అడవిని, వాసన గలిగి కదలుతున్న రేకులుగల దానిని నేను సేవింతును
మానవశరీరంలో పైభాగాన బ్ర్రహ్మరంధ్రం దగ్గర ఉన్న సహస్రదళపద్మమే ఇక్కడ చెప్పిన మహాపద్మాటవి.
సహస్రారము ఎనిమిది దళాలు గల పద్మము. ఇందులోని ఒక్కొక్కదకములోను చిన్నచిన్న రేకులు 125 చొప్పున ఉంటాయి. ఈ రకంగా వెయ్యిదళాలుంటాయి. అందుకే దాన్ని సహస్రదళపద్మము అంటారు. ఇందులోని ఎనిమిది దళాలు ఎనిమిది దిక్కులకు తిరిగిఉంటాయి. స్వచ్చందతంత్రంలో
తస్మా దూర్ధ్వం కులం పద్మం సహస్రారమథోముఖం
మహాపద్మవనం చేదం సమానం తస్య చోపరి ॥
దానికి పైన వేయిరేకులు గల కులపద్మము అధోముఖమై ఉన్నది. అదే మహాపద్మవనము. అందులోనే దేవి ఉంటుంది.
ఇదే విషయాన్ని వివరిస్తూ
తస్మా దూర్చ్వమధోముఖం వికసితం పద్మం సహస్రచ్చదం 1
నిత్యానందమయీ సదాశివపురీ శక్తేనమశ్శాశ్వతం 11
ఆజ్ఞాచక్రం దాటిన తరువాత, షట్బక్రాలకు పైన బ్రహ్మరంధ్రానికి కొద్దిగా దిగువభాగంలో వేయిదళాలు గల పద్మమున్నది. అది నిత్యానందమయమైన శివపురము.
ఆధారచక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిని గనక జాగృతంచేసినట్లైతే అది గ్రంధిత్రయాన్ని దాటి సహస్రారం చేరుతుంది. అప్పుడు అక్కడ నుంచి జాలువారిన అమృతపుధారలతో సాధకుని శరీరంలోని 72000 నాడీమండలము తడుస్తుంది. అప్పుడు తడనుభవించే ఆనందం అనుభవైకవేద్యము. మహాపద్మవనాన్ని శంకరభాగవత్పాదులు తమ సౌందర్య లహరిలోని 21వ శ్లోకంలో
తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణాం అస్యపురి కమలానాం తవ కలాం
మహాపద్మాటవ్యాం మృదితమల మాయేన మనసా
మహాన్తః పశ్యంతో దధతి పరమాష్లాద లహరీమ్ ॥
తల్లీ ! భగవతీ ! మెరుపుతీగలాగా సూక్ష్మమై, దీర్ఘమై, సూర్యచంద్రాగ్నిరూపమై, షట్బక్రాలకుపైన సహస్రారంలో ఉన్న మహాపద్మటవిలోని నీ పాదాఖ్యకళను మహాత్ములు పరమోహ్లాదలహరిగా భావిస్తారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below