శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0060 నామం : కదంబవనవాసినీ
"ఓం ఐం హ్రీం శ్రీం కదంబవనవాసిన్యై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "కదంబవనవాసిన్యై నమః" అని చెప్పాలి.
కదంబ = కడిమి చెట్లయొక్క
వన = తోటయందు
వాసినీ = వసించునది
(సంస్కృతంలో కడిమి చెట్టును 'నీప వృక్షం' అని అంటారు.
వర్షముతోను, మబ్బులతోను ప్రత్యేక సంబంధాన్ని కలిగి వుండేవి - చెంగల్వ, కడిమి, నెమలి. వీటిలో కడిమి చెట్లు ముఖ్యమైనవి. దివిని, భువిని వర్షధారలు కలుపుతాయి. ఈ వర్షధారలలోని ఆపస్సులు సృష్టికి దోహదపడతాయి. ఈ సత్సంధానాన్ని నిరంతరం కోరుకునేవి కడిమి చెట్లు. అందుచేతనే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి ఈ చెట్లు, ఈ చెట్లు గల ఉద్యానవనాలు ఇష్టము. ఈ కడిమి వృక్షాల తోట మధ్యలోనే ఇంతకు పూర్వ నామంలో చెప్పిన చింతామణి గృహం వుంటుంది. ఆ గృహంలోనే అమ్మవారు వుంటుంది. అందుకని "కదంబవనవాసిని" అనే నామం అమ్మవారికి సార్థకమైంది.
కదంబం అనగా వెలుగు నీడలకు అతీతమైన చోటు ద్వంద్వాతీత స్థితి అక్కడ రాగద్వేషాలు లేవు, జయాపజయాలు లేవు, ద్వంద భావాలకు చోటు లేదు,ప్రజ్ఞ ప్రదార్థ విభజన లేదు, రజస్తామస్సులు లేవు ,ధర్మ అధర్మమము లేదు, కేవలము ఉండుటయే ఉన్నది, కేవలము ఉన్నది అదే నిర్వికారస్థితి అట్టి వనము మనలోను సృష్టిలోను ఉన్నది మనలో సుషుమ్నయందు హృదయ పద్మము నుండి ఆజ్ఞపద్మము వరకు వ్యాపించి ఉన్నది. ఈ వనమందు నిత్యము ఓంకార నాధము వినిపిస్తుంది, ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేస్తుంటారు, భూమిపైనా కూడా కడిమి చెట్ల మధ్య నదోపాసన చేస్తుంటారు, అట్టి వనములోనే ఈ చింతామణి హృహము ఉంటుంది...
అయితే ఇక్కడ మనకు అమ్మవారు ఎటువంటి స్థలంలో నివాసంగా ఉంటుందో మనకు, సూక్షంగాను అలాగే స్పష్టముగాను వివరించారు.. ఈ నామము లో అమ్మవారి స్థిర నివాసము యొక్క రహస్యము కూడా మనకు వసిన్యాది దేవతలు వివరించారు.. ఏ ఉపసాకుడు అయితే తన హృదయములో రాగ ద్వేషాలు, ద్వంద భావనాలు, వ్యత్యాసాలు, చిన్న పెద్ద పెద్ద గొప్ప, మంచి చెడు, పాపం పుణ్యం, కులం మతం, నీది నాది, కోపం సంతోషం.. ఇలాంటి ఏ గుణాలకు స్పందన లేని వాడు కేవలము తాను పరంధామునిలో నే నివసిస్తున్నాను నేను గా ఏమీ లేను నేనే అన్ని అయిన పరంధామునిలో ఉన్నాను అన్న ఈ ద్వందార్ధ స్థితికి చేరుకున్న స్థితి అంటే తానుగా ఏమీ లేడు, తాను అన్ని అయిన పరంధామునిలో ఉన్నాడు, ఉన్నట్టు కాదు ఉన్నాడు అన్న భావన లోకి చేరుకున్నపుడు అతని స్థితి దేనికి ఏ గుణానికి స్పందించదు ఎందుకంటే అంతా అన్ని గుణాలు అన్ని రూపాలు తనలో తాను అన్నిటిలో ఉన్న స్వరూప స్థితిని దర్శించగలుగు తాడు అట్టి హృదయము నిండా అమ్మ ధ్యాస తప్ప ఏమీ ఉండదు అటువంటి హృదయము అమ్మవారి నివాసము అయిన చింతామణి గృహము అట్టి దేహమే కదంబ వనము.. ఇదే అక్షర సత్యము.. అట్టి స్థితి పొందాలి అంటే అంత జగన్మాత దర్శనం చేసుకోవాలి అన్నిటా ఆ తల్లినే ధ్యానించాలి, మనసులోని ఆలోచనలు క్రమంగా నియంత్రించాలి.. బేధ భావం తొలగించాలి, అన్నిటా తేడా ను గమనించడం విమర్శించడం, మానుకొని అంతా జగదoబ స్వరూపమే అన్న స్థితికి రావాలి.. "కడిమి చెట్ల తోటలో వసించునది" అని ఈ నామానికి అర్థం
మంత్ర ప్రయోగ ఫలితం
దుఃఖనివారణకు ప్రతి ఆదివారం దర్భాసనంపై కూర్చుని ఈ మంత్రాన్ని 1000సార్లు - జపిస్తే చాలు. దుఃఖాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. భార్యాభర్తల తగాదాలు పెరిగిపోయి విడిపోవడానికి సిద్ధమయ్యే స్థితి దాపురించినపుడు, ఈ మంత్రాన్ని 27 రోజులు, రోజూ 1000సార్లు జపిస్తే ఐకమత్యంగా ఉంటారు. నిత్యం ఆనందం పొందడానికి ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి:
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0061 నామం : సుధాసాగరమధ్యస్థా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation