శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0058 నామం : పంచబ్రహ్మాసనస్థితా
"ఓం ఐం హ్రీం శ్రీం పంచబ్రహ్మాసనస్థితాయై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం . ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "పంచబ్రహ్మాసనస్థితాయై నమః" అని చెప్పాలి.
పంచ = అయిదుగురు
బ్రహ్మ = బ్రాహ్మలచే (నిర్మించబడిన)
ఆసన = మంచం వంటి ఆసనము నందు
స్థితా = ఉన్నది
బ్రహ్మ , విష్ణు , రుద్రా , ఈశ్వర , సదాశివులు ఐదుగురిని పంచబ్రహ్మలు అంటారు. వీళ్లల్లో మొదటి నలుగురిని నాలుగు మంచం కోళ్ల గాను, సదాశివుణ్ణి పానుపుగాను ఒక మంచాన్ని ఊహిస్తే - ఆ మంచం "పంచ బ్రహ్మసనం అవుతుంది. ఆ మంచం మీద ఆశీనురాలై అమ్మవారు ఉంటుంది. సౌందర్యలహరిలో 8 వ శ్లోకంలో శంకరాచార్యులవారు 'శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం' అంటారు. (పరమశివుడు అంటే సదాశివుడు అని, పర్యంకం అంటే ఒక అర్థంలో తల్పం లేదా పానుపు, ఇంకో అర్థంలో తొడ అని అర్థం.) అసలు ముందు ఈ మంచం అంతరార్థం ఏమిటో చూద్దాం.
నాలుగు కోళ్ల మంచం అనగానే సహజంగా మనకు తెలిసిన మంచం లాగ ఉంటుందనుకుంటాం. కానీ ఆలా ఉండదు. ఇది సంకేత బాష. కుండలినీ శక్తీ వెన్నెముకలోని సుషుమ్నా ద్వారా - ఊర్ధ్వగతిని పొందుతున్నప్పుడు - మూలాధార, స్వాధిష్టానములకు సంబందించిన "బ్రహ్మగ్రంధి" ని ( Brain of instincts, reflexes and desires), మణిపూర, అనాహత చక్రాలకు సంబందించిన "విష్ణుగ్రంధి" ని (Brain of affections and emotions), విశుద్ధి, ఆజ్ఞా చక్రాలకు సంబంధించిన "రుద్రగ్రంథి" ని (Brain of intellect and wisdom) లలాటానికి, శిరోమధ్య భాగానికి సంబందించి ఈశ్వర స్థానమును - అధిగమిస్తుంది. అంటే సుషుమ్నా మార్గంలో ఇవి మైలు రాళ్లు వంటివి. ఈ నాల్గింటిని నాలుగు మంచం కోళ్లతో సూచించారు ఇంకా మనలో ఉండే సహస్రారకమలా స్థానంలో వుండే సదాశివుణ్ణి - మంచం తల్పంగా సూచించారన్నమాట.
ఈ పంచ బ్రాహ్మలు దిక్కులు పరంగా - తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఊర్ధ్వదిశలను సూచిస్తారు. పంచభూతాలపరంగా - పృథివి, ఆపస్, తేజస్సు, వాయువు, ఆకాశాలను సూచిస్తారు. హల్లుల్లో ఐదు వర్గాల ప్రథమాక్షరాలైన క, చ, ట, త, ప లను సూచిస్తారు. పంచ ప్రణవాలైన "శ్రీం, హ్రీం, క్లీo, ఐo, సౌ:" లను గూడ సూచిస్తారు. ఇన్ని విధాలుగా అమ్మవారు పంచబ్రహ్మాసనస్థితా అవుతుంది. ఈశ్వరుడు అనగా ఒక్కొక్క జీవిని అధిష్టించి ఉన్న తత్వము త్రిగుణములను అధిష్టించిన వారే త్రిమూర్తులు వీరందరినీ అధిష్టించినదే శ్రీ దేవి తత్వము. ఈ ఐదుగురు శ్రీచక్రమున కోన పంచకముగా గోచరింతురు. ఈ ఐదుగురు బ్రాహ్మలు సృష్టిని అధిష్టించిన వారు పంచ కర్మేంద్రియాలకు, పంచ ఙ్ఘనేంద్రియాలకు, పంచ తన్మాత్రలకు, పంచభూతములకు వీరు అధిదేవతలు వీరిని అధిష్టించినది శ్రీదేవి. అంటే ఆయా గుణములు గల శక్తి ఆమె మంచపు కోడెలాగా ఉన్నవి ఆ తల్లి ఆధీనంలో సేవించు చున్నవి అని భావము.
ఆ శక్తి కూడా ఆ పరంజోతి స్వరూపమే, ప్రతి శక్తి తననుండి సృష్టించు కున్నదే. అన్ని శక్తులకు ఆధార భూతమై శ్రీ దేవిని మనసారా నమస్కరించి ధ్యానించి ఆశ్రయించి శరణు వేడిన వారికి ఆమె సర్వస్య శరణాగతి అయి ఆధార భూతమై నడిపిస్తుంది. అన్ని తానై రక్షిస్తుంది. తల్లి తండ్రి గురువు దైవంగా మనకు నాలుగు దిక్కులు ఆమె అన్న సత్యం గ్రహించాలి... "యా దేవీ సర్వ భూతేషు" అన్నారు అంటే అన్ని రూపాలలో అనేక రూపాలలో మనకు ఆధారంగా ఉన్నది ఆ జగన్మాత శక్తియే అన్న ఆలోచన ఎప్పుడూ నీ హృదయంలో ఉండాలి.. అప్పుడే.. శరణాగతి ని పొందగలవు...
'పంచబ్రహ్మలచే సూచించబడే ఆసనము నందు ఉన్నది' - అని ఈ నామానికి అర్థం .
మంత్ర ప్రయోగ ఫలితం
రోజూ ఇంట్లో అగ్నిహోత్రాన్ని కట్టెలతో వెలిగించి ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరిస్తూ అవునేతిని అందులో పోస్తూ హవనం చేస్తే ఎంత క్లిష్టమైన సమస్యయైనా కేవలం 41 రోజుల దీక్షతో తొలగిపోతుంది. ఆవు నేతితో దీపారాధన చేసి, అమ్మవారి ఎదురుగా ఆ దీపాన్ని ఉంచి, అది ఆరిపోకుండా చూసుకొంటూ 9 రోజులపాటు రోజూ 1008 సార్లు ఈ మంత్రం జపించేస్తే ఎంత చిక్కుముడియైనా విడిపోయి, చివరకు జైలుపాలైనవాడు కూడా బయటకు వస్తాడు. ఈ మంత్రాన్ని నిత్యం 11 సార్లు జపించే వారికి ఏ సమస్యలూ రావు. వచ్చినా ఇట్టే తొలగిపోతాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0059 నామం : మహాపద్మాటవీ సంస్థా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation