శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0058 నామం : పంచబ్రహ్మాసనస్థితా
"ఓం ఐం హ్రీం శ్రీం పంచబ్రహ్మాసనస్థితాయై నమః"
భాష్యం
పంచబ్రహ్మలచేత చేయబడిన అసనముమీద కూర్చున్నది. పంచభిః పబ్రహ్మభిః నిర్మితం ఆసనం మంచరూపకం తత్ర స్థితా పంచబ్రహ్మలనే కోళ్ళుగా ఉంచి తయారుచేసిన ఆసనము మీద కూర్చున్నటు వంటిది. రుద్రయామళంలో
బిందుస్థానం సుధాసింధుః పంచయోన్య స్పుర ద్రుమాః ॥
తత్రైవ నీపశ్రేణీ చ తన్మధ్యే మణి మంటపం ॥
తత్ర చింతామణికృతం దేవ్యా మందిర ముత్తమం ।
శివాత్మకే మహామంచే మహేశానోపబర్పణే 1
అతిరమ్యతరే తత్ర కశిపుశ్చ సదాశివః ।
భృతకా శ్చ చ్చతుష్పాదా మహేంద్ర శ్చవ తద్లహః ॥
తత్రాస్తే పరమేశానీ మహాత్రిపురసుందరీ ।
శివార్మమండలం భిత్వా ్రావయం తీందుమండలమ్ ॥
బిందుస్థానమే పాలసముద్రము. పంచయోనులే కల్పవృక్షాలు. అక్కడ కదంబవనం మధ్యలో మణిమండపం. ఆ మణులు చింతామణులు. శక్తిరూపమైన మంచెయందు పరమేశ్వరుడు తలగడ, బ్రహ్మాదులు సేవకులు. ఇంద్రుడు తమ్మిపడిగ, అట్టిసింహాసనం మీద దేవి ఆసీనయై ఉంటుంది.
ఐదుగురు బ్రహ్మలతో నిర్మించబడిన ఆసనాన్ని పంచబ్రహ్మాసనము అంటారు. దానిమీద పరమేశ్వరి కూర్చుని ఉంటుంది. అందుకే ఆమెను పంచబ్రహ్మసనస్థితా అంటారు.
బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు. వీరిని పంచబ్రహ్మలు అంటారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష. ఈశానములు వీరి మంత్రాలు. షట్బక్రాలలోను పరమేశ్వరిని అర్చించే వారికి వివిధ రకాలయిన ఫలితము ఉంటుంది. అంటే వారందరికీ ముక్తి లభిస్తుంది. కాని అది జీవాత్మపరమాత్మల విలీనం కాదు. అయితే ఆధారస్వాధిష్టానాలు అంధకారబంధురాలు. ఇక్కడ పరమేశ్వరిని అర్చించే వారికి మోక్షముండదు. ఇక
1. మణిపూరంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు.
2. అనాహతంలో దేవిని అర్చించేవారు దేవిపట్టణంలోనే నివసించగలుగుతారు. దీన్ని సాలోక్యముక్తి అంటారు.
౩. విశుద్ధిచక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు. ఇది సామీప్యముక్తి.
4. ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన రూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి.
5. సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. సాయుజ్యం.
ఈ విధంగా సాధకుడు చేసే అర్చనా విధానాన్ని బట్టి అతడికి ముక్తి లభిస్తుంది. పంచబ్రహ్మలు దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్నటువంటి వారై, బాగా ఆలోచించి సామీప్యముక్తి పొందినట్లైతే దేవికి అతిసమీపంగా ఉండి ఆమెను సేవించవచ్చు అని తలపోసి, విశుద్ధిచక్రంలో ఆమెను ఉపాసించారు. అందువల్ల దేవికి సేవకులుగా, అత్యంతదగ్గరగా ఆమె యొక్క సింహాసనానికి కోళ్ళుగా ఉండగలిగారు. ఈ విషయాన్ని శంకరభగవత్సాదుల వారు తమ సౌందర్య లహరిలోని 92వ శ్లోకంలో
వర్ణిస్తూ
గతా స్తే మఞ్చత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః*
*శివస్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటిత ప్రచ్ఛదపటః|*
*త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణతయా*
*శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్||92||*
ఓ భగవతీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే సింహాసనానికి కోళ్ళుకాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు.
శ్రీచక్రంలో 5 శక్తిచక్రాలు, 4 శివచక్రాలు ఉన్నాయి. ఇందులోని శక్తిచక్రాలే పంచబ్రహ్మలు. ఈ శక్తిచక్రాలకు పైన దేవి ఉంటుంది. కాబట్టి ఆమె పంచబ్రహ్మాసనస్థితా అనబడుతోంది.
మానవశరీరంలో షట్బక్రాలున్నాయి. ఆ చక్రాలలో ప్రతిదానికీ అధిదేవతలున్నారు.
ఆధారచక్రానికి అధిదేవత
స్వాధిష్టానానికి అధిదేవత
మణిపూరానికి అధిదేవత
అనాహతానికి అధిదేవత
విశుద్ధిచక్రానికి అధిదేవత
ఆజ్ఞాచక్రానికి అధిదేవత
గణపతి
బ్రహ్మ
విష్ణువు
రుద్రుడు
మహేశ్వరుడు
సదాశివుడు
వీటన్నింటికీ పైన సహస్రారంలో ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టి ఆమె పంచటబ్రహ్మాసనస్థితా అని చెప్పబడుతోంది.
పంచబ్రహ్మలు - పంచభూతాలు. ఈ పంచభూతాలమీద అధికారం కలిగినటువంటిది; వాటిని తన అధీనంలో ఉంచుకున్నటువంటిది పరమేశ్వరి. అందుచేతనే ఆమె పంచబ్రహ్మసనస్థితా అనబడుతుంది.
దేవీభాగవతంలో ఈ విషయాన్ని వర్ణిస్తూ
చింతామణిగృహే రాజన్ ! శక్తితత్వాత్మకె పరైః
సోపానైః దశభిర్యుకో । మంచకో౨ ప్యధిరాజితే 1
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ । ఈశ్వరశ్చ సదాశివః
ఏతే పంచ ఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః ॥
రాజా ! చింతామణి గృహంలో శక్తితత్వ్వాత్మకమైన పదిమెట్ల వరుసతో దివ్య కాంతులతో ప్రకాశించే మంచమున్నది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు దానికి నాలుగుపాదాలు కాగా సదాశివుడు దానిపై పలకగా ఉంటాడు.
తస్యోపరి మహాదేవో భువనేశో విరాజితే
యాదేవీ నిజలీలార్ధం ద్విధాభూతా బభూవహ ॥
వామాంకే సన్నిషణ్ఞా స్వదేవీ శ్రీభువనేశ్వరీ |
దానిమీద త్రిభువనేశ్వరుడు, మహాదేవుడు అయిన కామేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరి అంటే నిరాకారుడు నిర్గుణస్వరూపుడు అయిన పరబ్రహ్మకదా ! మరి ఇక్కడ భువనేశ్వరుడు ఎవరు ? అనుకుంటావేమో ? ఆ పరమేశ్వరియే తనలీలావిలాసార్థము రెండురూపాలు ధరిస్తున్చది.
సృష్టి ప్రారంభానికి ముందు అంటే కృతయుగానికి పూర్వము బిందురూపంలో ఉన్న పరబ్రహ్మ అంతకు ముందు ప్రళయం జరిగినప్పుడు కర్మ పరిపక్వం చెందకుండా తనలో లీనమైన జీవులకు కర్మక్షయం కలిగించాలనే ఉద్దేశ్యంతో సృష్టి చెయ్యాలనుకున్నటువంటి వాడై తనను తాను రెండుగా విభజించుకున్నాడు. అంటే తనలో నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు. ఇప్పుడు
పరమేశ్వరుడు - ప్రకాశాంశ
శక్తి - విమర్శాంశ
వారే శివశక్తులు. పరమేశ్వరి పరమేశ్వరులు. కామేశ్వరి కామేశ్వరులు. భువనేశ్వరి భువనేశ్వరులు. కాబట్టి ఇక్కడ రెండురూపాలు ఆమెవే. అటువంటి భువనేశ్వరుడి వామాంకముమీద ఆ దేవి ఆసీనమై ఉంటుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below