శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0057 నామం : చింతామణి గృహాంతఃస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం చింతామణి గృహాంతఃస్థాయై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం . ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు " చింతామణి గృహాంతఃస్థాయై నమః " అని చెప్పాలి.
పూర్వనామంలో తెలిపిన మణిద్వీపంలో చింతామణి గృహం లో అమ్మవారు ఉంటుంది.
చింతామణి = చింతామణులచేత నిర్మించబడిన
గృహ+అంతః + స్థా = గృహము లోపల ఉన్నది.
మణి అంటే రత్నం అని అర్థము. రత్నం అంటే స్వయం ప్రకాశ, ప్రసార, ప్రచోదన లక్షణాలు కలది. ఈ మణుల లక్షణం మనలో అంతః స్ఫురణాన్ని, మేథాశక్తిని, తేజస్సును సూచిస్తుంది.
చింతామణి - "చింతా" అంటే 'ఒక విషయాన్ని గురించి మనస్సు అమితంగా ఆలోచింపచేసే ప్రక్రియ' అని చెప్పుకోవచ్చును. కోరినవి ఇచ్చే గుణం కలిగినవే చింతామణులు . అమ్మవారు చింతామణులు అనే ఇటుకలతో కట్టిన ఇంటిలో ఉంటుందట. అమ్మవారు ఉండే ఇంటి ఇటుకలకే దానగుణం అంతగా ఉంటే - ఆ ఇంటి ఇల్లాలైనా అమ్మవారు ఎల్లాంటి అనుగ్రహం కలదై ఉంటుందో ఊహించుకోవచ్చు. అంటే - ఆమె దాతృత్వ గుణం ఆమె ఇంటి గోడలకి కూడా అబ్బిందన్నమాట!!
ప్రతి వ్యక్తిలోని దాతృత్వ గుణాలను ఈ చింతామణులు సూచిస్తాయి. అసలు చింతామణులకు దాన గుణం అమ్మవారు వాటి మధ్యఉండటం వల్లనే వచ్చి ఉండాలి.
ఒక చింతామణి ఉంటేనే అది ఎన్నో కోరికలను తీరుస్తుంది. మరి ఇలాంటి ఎన్నో చింతామణులతో కట్టిన గృహం అయితే ఆ ఇంటికి ప్రధాన గుణం ఎంత ఉంటుందో ఊహించలేము. అలంటి చింతామణులచే పొదగబడిన గృహంలో అమ్మవారు నివసిస్తుంటారట. మనలో ఈ గృహం సహస్రారంలో ఉంటుంది. సుధాసాగరమే సహస్రారం. సుమేరు శృంగమే సహస్రారం. ఈ సుధాసాగరంలోని మణిద్వీపంలో చింతామణి గృహం ఉంటుందన్నమాట ! ఇవన్నీ సంకేతాలే.
(చింతామణులతో కూడిన సంకల్పాన్ని - 'కల్పవృక్షం' అని, చింతామణితో కూడిన వాక్కును - 'కామధేనువు' అని అంటారు. య, ర,ల, వ - అక్షరాలను అంతస్థములు అంటారు. చింతామణి మంత్రానికి "క్లీం తో పాటు ఈ అంతః స్థాన యం, రం, లం, వం కూడా కలుస్తాయి.
మనలోని చింతామణి సహస్త్రరము ప్రతి సాధకుడు ఆ చింతామణిని చేరుకోవడానికి సాధన చేయాలి అక్కడ కొలువై ఉన్న తల్లి ని దర్శించాలి... అందుకు ఎంచుకున్న మార్గమే ఈ పూజ మంత్రోచ్చారణ సాధన... ఆత్మ చైతన్య మార్గం లో ప్రయాణించడానికి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అప్పుడు నీకు ఉన్న ఆటంకాలు అర్దమ్ అవుతుంది.. ఆ ఆలోచన బాహ్య ప్రాపంచిక విషయాలు అని అర్దమ్ అయితే ఆత్మ చైతన్య మార్గంలో ప్రయాణానికి సిద్ధ అవుతుంది నీలోనే దాగి ఉన్న చింతామణి సహస్రార గృహంకి చేరు కొని అక్కడ కోలువైవున్న ఆ తల్లిని అంటే నీ ఆత్మ స్వరూపాన్ని నువ్వు చేరుకోగలవు..
ఆ జగన్మాత అపార కరుణా మూర్తి ఎవరైతే ఇదే లక్ష్యం గా సాధన చేస్తారో వారికి ఆమె దారి చూపిస్తుంది... దగ్గరకు చేరుస్తుంది...
మంత్ర ప్రయోగ ఫలితం
సొంతం గా గృహం కావాలి అనుకునే వారు ఈ నామాన్ని నిత్యం 1008 జపిస్తూ ఉండాలి.
చింతామణులచే నిర్మింపబడిన గృహం లోపల నివసించునది అని ఈ నామానికి అర్థము .
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0058 నామం : పంచబ్రహ్మాసనస్థితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation