శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0057 నామం : చింతామణి గృహాంతఃస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం చింతామణి గృహాంతఃస్థాయై నమః"
భాష్యం
చింతామణి అనేది ఒక మణి. ఈ మణి దగ్గర ఉంటే చాలు కోరినకోరిక తీరిపోతుంది. ఒక మణి ఉంటేనే కోరినకోరిక తీరుతుంది. మరి అటువంటి మణులు అనేకం ఉన్నాయి. వాటితో నిర్మించబడిన గృహమది. అందులో పరమేశ్వరి ఉంటుంది. భక్తుడు ఆ దేవి సన్నిధికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆమె పేరు తలిస్తే చాలు కోరిన కోరికలు తీరిపోతాయి. అంటే పరమేశ్వరి భక్తులకు సంకల్ప మాత్రంచేతనే కోరికలు ఈడేరతాయి.
చింతామణి అనేది ఒక మంత్రం. దాన్ని గతంలో వివరించటం జరిగింది. అటువంటి చింతామణుల గృహంలో ఉంటుంది దేవి. బ్రహ్మాండపురాణంలో చింతామణి గృహే సర్వం చింతామణిమయంస్కృతం. అక్కడ ఒక్క గృహమేకాదు. సర్వమూ చింతామణి మయమే అని చెప్పబడింది. లలితాస్తవరత్నములో
చింతామణి గణరచితం చింతాందూరీకరోతు మే సదనమ్ ॥
చింతామణులతో నిర్మించిన గృహము నానాచింతలను దూరంచేస్తుందని చెప్పబడింది.
సహస్రయోజనా యామే చింతామణి మయే గృహే
మేరౌ తు స్వల్పపరిమాణం శృంగారవర్డ వర్యస్యో
త్తరతః సకలవిబుధసంసేవ్యం చింతామణి
గణరచితం చింతాం దూరీకరోతు మే సదనమ్ ॥
వేయి యోజనాలు పరిమాణముగల చింతామణి గృహము. దీనిముందు మేరుపర్వతం కూడా చాలాచిన్నది. సకలదేవతలచే సేవించబడు చింతామణి గృహము నా చింతలను దూరముచేయుగాక.
ఇక్కడ రెండు పదాలున్నాయి. 1. చిత 2. చింత.
చితాచింతాద్వయో ర్మధ్యే చింతానామ గరీయసీ ।
చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవినమ్ ॥
చిత ప్రాణం లేని దాన్ని దహిస్తుంది. చింత అనేది ప్రాణమున్న శరీరాన్ని దహిస్తుంది. అటువంటి చింతలను దూరంచేసే చింతామణి గృహంలో ఉంటుంది పరమేశ్వరి.
దేవీభాగవతంలో చింతామణిగృహాన్ని వర్ణిస్తూ
నవరత్నమయా దగ్రే చింతామణి గృహం మహత్ ॥
తత్రత్యం వస్తుమాత్రం తు చింతామణి వినిర్మితం ॥
సూర్యోడ్గారో ఫలై స్తద్వ చ్చంద్రోద్గారో ఫలై స్తథా ॥
విద్యుత్ ప్రభోపలైః స్తంభాః కల్పితా స్తు సహస్రశః ॥
యోసాంప్రభాఃభిరంతస్థవస్తు కించి న్న దృశ్యతే 11
నవరత్న ప్రాకారానికి ముందు శ్రీకరమైన చింతామణి గృహము మహోజ్వలమైన కాంతులతో ప్రకాశిస్తుంటుంది. దానిలోని ప్రతి వస్తువూ చింతామణులచే నిర్మించబడినదే. సూర్యకాంత, చంద్రకాంతశిలలతో, మెరుగుకాంతమణులతో నిర్మించబడిన స్తంభములు దీపపుస్తంభాలలాగా ప్రకాశిస్తాయి. ఆకాంతులలో ఏ వస్తువూ కనిపించదు.
తదేవదేవీసదనం మధ్య భాగేవిరాజితే ।
సహస్రస్తంభసంయుక్తా శృత్వార స్తేషమండపాః ॥
శృంగారమంటప శ్చెకో ముక్తిమంటప ఏవ చ।
జ్ఞానమండపసంజ్ఞ స్తు తృతీయః పరికీర్తితః ॥
ఏకాంతమండప శ్చైవ చతుర్థః పరికీర్తితః ।
నానావితాన సంయుక్తా । నానాధూపై స్తు ధూపితా ॥
కోటిసూర్యసమా కాంత్యా ! బ్రాజంతే మండపాఃశుభాః
ఇటువంటి వేయిస్తంభాలు గల మండపాలు నాలుగున్నాయి. అవి.
1. శృంగారమండపము 3. జ్ఞానమండపము
2. ముక్తిమండపము 4. ఏకాంతమండపము
ఈ మండపాలన్నీ ధూపములతో సువాసనలను వెదజల్లుతుంటాయి. ప్రతి మండపము కూడా కోటిసూర్యకాంతులు వెదజల్లుతూ ఉంటుంది. వీటికి నాలుగువైపులా కాశ్మీరవనాలున్నాయి. అక్కడ మృగాలు, మహాపద్మాలు, తుమ్మెదలు, కారండవషక్షులు, హంసలు తిరుగాడుతుంటాయి.
శృంగారమండపే దేవ్యో ॥ గాయంతీ వివిధై స్వరై్యః !
సభాసదో దేవవరా । మధ్యే శ్రీజగదంబికా 1
శృంగారమండపంలో దేవతలు మధురస్వరాలతో గానం చేస్తుంటారు. అక్కడ దేవతలంతా సభ తీర్చి ఉంటారు. వారి మధ్యభాగన సింహాసనం మీద జగదంబిక ఆసీనురాలయి ఉంటుంది.
ముక్తిమండపమధ్యే తు । మోచయ త్యనిశం శివా ।
జ్ఞానోపదేశం కురుతే । తృతీయే నృపమండపే 1
ముక్తిమండపంలో నుండి దేవి జగత్తులోని భక్తులందరికీ ముక్తి ప్రసాదిస్తుంది. జ్ఞానమంటపంలో భక్తులకు జ్ఞానోపదేశం చేస్తుంది.
చతుర్థే మండపే చైవ ! జగద్రక్షా వివించనమ్
మంత్రిణీసహితా నిత్యం ! కరోతి జగదంబికా ॥
నాల్లవమండపంలో దేవి తన మంత్రిణులతో కొలువుండి లోకరక్షణ గూర్చి ఆలోచిస్తుంటుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below