శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0056 నామం : శ్రీమన్నగర నాయికా
"ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమన్నగరనాయికాయై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "శ్రీమన్నగరనాయికాయై నమః" అని చెప్పాలి.
శ్రీమత్ = శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన
నగరనాయికా = నగరమునకు అధిష్టాత్రి
శ్రీచక్రమే శ్రీమన్నగరం. పూర్వనామంలో చెప్పిన సుమేరువు ఉత్తర కొనవద్ద ఉండే సుధాసాగరము నందలి మణిద్వీపంలో ఉండే నగరమే శ్రీమన్ననగరం. ఇది దేవశిల్పి మయునిచే నిర్మించబడిన నగరం. దీన్నే శ్రీవిద్యానగరం అంటారు. ఇదియే బ్రహ్మవిద్యానగరం. విశ్వప్రణాళికను ఇక్కడనుండే అమ్మవారు ఆదేశాలు ఇస్తూ నిర్వహిస్తుంది.
అన్ని విద్యలకు ఇదే మూల స్థానము, అన్ని విద్యలకు ఇదే ఆలయము, అమ్మవారే సర్వ విద్యలకు అధిదేవత అనడంలో సందేహము లేదు, మనకు కావల్సిన ఙ్ఘన సంపదను ఇచ్చునది వ్యాపింపచేసునది విద్యా అరహతను నిర్ణయించు నది కూడా శ్రీమాత యే...
విద్యకు ఉండవలసిన ఆరహత క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఉంటే ఏకాగ్రత పట్టుదల కూడా ఉంటుంది అట్టివారికే ఏ విద్య అయినా ప్రాప్తిస్తుంది. మనకు మన విద్యాలయం పాఠశాల, అందులో గురువు దైవ స్వరూపం. ఎప్పటికి మనిషి స్వభావం విద్యార్థిని అన్న దశలో ఉన్నంత కాలం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు... నాకు అంతా తెలుసు అన్న అహంకారం కలిగిన రోజు నీ అబ్యాసం కూడా ఆగిపోతుంది. సకల విద్యలకు నిలయమైన ఆ తల్లి నామాన్ని ప్రతి ఒక్కరు ధ్యానించాలి... ఙ్ఘనమును పొందుటకు అరహతను సంపాదించాలి.
శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్టాత్రి అని ఈ నామానికి అర్థము .
మంత్ర ప్రయోగ ఫలితం
ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు జపిస్తే మంచి జీతంతో కూడిన ఉద్యోగం వస్తుంది. రోజూ 1000 సార్లు చొప్పున 41 రోజులు జపిస్తే సొంత ఇల్లు ఏర్పడుతుంది. సంవత్సరకాలం రోజూ 108 సార్లు జపిస్తే కటిక దరిద్రుడు కూడా సంపన్నుడవుతాడు. మంచి పదవులు పొందాలనుకొనేవారు రోజూ 1000 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని సంవత్సర కాలం జపించండి. మోక్షలక్ష్మిని పొందాలనుకొనేవారు వీలున్నపుడల్లా ఈ మంత్ర జపంచేయడం మంచిది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0057 నామం : చింతామణి గృహాంతఃస్థా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation