శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0055 నామం : సుమేరు శృంగమధ్యస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం సుమేరుశృంగమధ్యస్థాయై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం . ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "సుమేరుశృంగమధ్యస్థాయై నమః" అని చెప్పాలి .
సుమేరు = మేరు పర్వతముయొక్క
శృంగ = శిఖరము యొక్క
మధ్యస్థా = మధ్య ప్రదేశము నందు ఉన్నది.
మన వెన్నెముకను 'బ్రహ్మదండము లేదా మేరుదండము' అని కూడా అంటారు. వెన్నెముక పైకొన మేరు శృంగము అవుతుంది. భూగోళం యొక్క ఉత్తర దక్షిణ దృవాలను కలిపే ధ్రువాక్షము (polar axis) భూగోళానికి మేరుదండము అవుతుంది. మన వెన్నెముకలో ఉండే సుషుమ్నా మార్గం పై కొనవద్ద సహస్రార కమలం ఉంటుంది. ఈ సహస్రార కమలంలో మధ్యస్థానమే మనలోని సుమేరు శృంగ మధ్యస్థానము. "మేరు" అనే పదం 'మ్ + అ + ఇ + ర్ + ఉ' అనే ఐదు అక్షరాలు ఉన్నాయి. వీటిని 5 శృంగాలుగా భావిస్తే మధ్య అక్షరం "ఇ " సూచించే శృంగ మధ్యస్థానం లో అమ్మవారుంటుంది.
శ్రీచక్రంలోని బిందువే మేరు శృంగం. ఇక్కడ ఉండే త్రిభుజంలో తూర్పు కోణం వద్ద ఇచ్చాశక్తి, నైఋతి కోణం వద్ద క్రియాశక్తి, వాయువ్య కోణం వద్ద జ్ఞానశక్తీ ఉంటాయి. ఈ మూడింటి మధ్య ఉన్న బిందు స్థానమే మేరు శృంగం. ఇక్కడే పరమశివుని అంకస్థానంలో అంటే ఎడమ తొడ మీద అమ్మవారు (పరమేశ్వరి) ఉంటుంది.
మొత్తం మీద ఈ నామానికి మేరు పర్వత శృంగ మధ్యస్థానం లో ఉన్నది, శ్రీచక్రంలోని బిందు స్థానంలో ఉండునది, సహస్రార కమల మధ్య స్థానంలో ఉండునది అని అర్థము. ఈ "సుమేరు శృంగమధ్యస్థా" అనే నామం నుండి "సుధాసాగర మధ్యస్థా" అనే నామం దాకా అమ్మవారి నివాసం చెప్పబడుతుంది.
మంత్ర ప్రయోగ ఫలితం
లలితా నామంలో ఇక చెప్పుకుంటున్న నామం ఆ తల్లి నివాసం గురించి ఈ పదాలు గృహ నిర్మాణము, గృహ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. ఒక్కో నామానికి ఒక్కో సమస్యను పరిష్కరించే గుణం ఉంది ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ ఉంటే మీ ప్రతి సమస్యకు పరిష్కారం లలితా నామంతోనే లభిస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0056 నామం : శ్రీమన్నగర నాయికా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation