శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0055 నామం : సుమేరు శృంగమధ్యస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం సుమేరుశృంగమధ్యస్థాయై నమః"
భాష్యం
దేవి మేరుపర్వతం మీద ఉన్నది. ఇది బంగారుపర్వతము అని ప్రసిద్ధి. ఈ పర్వతం మీద త్రికోణ ఆకారంలో మూడు శిఖరాలున్నాయి. వాటి మధ్యన ఇంకొక శిఖరమున్నది. “లలితాస్తవరత్నము”లో దుర్వాసుడు “మేరుపర్వతము లోకాలన్నింటి లోకీ గొప్పదై ప్రకాశిస్తునది. ఈ పర్వతము మీద మూడు శిఖరాలున్నాయి. ఆ శిఖరాలు మూడూ త్రిమూర్తులకు నిలయమై ఉన్నాయి. వాటి మధ్యన నాల్లవశిఖరమున్నది. అదే దేవి నివాసస్థానము. ఆ శిఖరము 400 యోజనముల ఎత్తున్నది.” అని చెప్పాడు.
లలితాఅప్టోత్తరశతానామావళిలో ఆ దేవిని రజతాచలశృంగమధ్యస్తామైనమో నమః అని చెప్పటం జరిగింది. రజతాచలము అంటే వెండికొండ. అదే వెండిలాగా తళతళామెరిసే హిమాలయము దీనిమీదనే ఉన్న కైలాసగిరిశిఖరం మీద శివాశివులుంటారు అని చెప్పబడుతోంది.
ఈ శిఖరము దేవతలచే పూజించబడుతున్నది. అందుచేతనే సామాన్యమానవులకు కనిపించదు. మానవశరీరంలో చెప్పబడే సహస్రదళపద్మమే మేరుపర్వతము. యోగి ఆజ్ఞాచక్రం దాటిన తరువాత మహానాదాన్ని దర్శిస్తాడు. అతడికి వాక్సిద్ధి కలుగుతుంది. మహానాదము నాగలిరూపంలో ఉంటుంది. అది శాంతమైనది. వరప్రదాయని ప్రకాశ మైనది. శూన్యమందు, విసర్గకు క్రిందగా సహస్ర దళపద్మమున్చది. అది పూర్ణచంద్రునిలా ప్రకాశిస్తుంటుంది. అధోముఖంగా ఉంటుంది. దాని కిరణాలు సూర్యకిరణాలకన్న ఎక్కువగా ప్రకాశిస్తుంటాయి. ఇది కేవలము ఆనందరూపమైనది.
సహస్రదళపద్మంలో కళంకరహితుడైన చంద్రుడున్నాడు. ఆ చంద్రమండలము మధ్యన త్రికోణమున్నది. దానియందు మహాశూన్యమున్నది. దానిని దేవతలు రహస్యంగా సేవిస్తూ ఉంటారు. ఆ శూన్యప్రదేశము చాలా రహస్యమైనది. అతిప్రయత్నముమీదగాని దాన్ని పొందలేరు. అది అపరిమితమైన సంతానరాశి. పరమశివుడు ఇక్కడే ఉంటాడు.
ఆయన సర్వాంతర్యామి. అజ్ఞానాన్ని మోహాన్ని పోగొడతాడు. అని రాజయోగంలో చెప్పబడింది. దీనినిబట్టి పరమేశ్వరి నివసించే మేరుశ్ళంగయే సహస్రదళపద్మము.
శ్రీచక్రంలోని ఎనిమిదవ ఆవరణ సర్వసిద్ధిప్రదచక్రము త్రికోణము. దీనిలో మూడువైపులా మూడుపీఠాలున్నాయి. అవి వరుసగా
1. కామగిరిపీఠము
2. పూర్ణగిరిపీఠము
3. జాలంధరపీఠము
కాగా త్రికోణం మధ్యన జాలందర పీఠమున్నది.
జాలంధరపీఠము - త్రికోణానికి ఉత్తరంవైపున ఉంటుంది. దీని అధిపతులు శక్తిబీజాధిపతులైన ఉమామహేశ్వరులుంటారు.
పూర్ణగిరిపీఠము - త్రికోణానికి దక్షిణంవైపున ఈ పీఠముంటుంది. దీని అధిపతులు
కామరాజబీజాధిపతులైన లక్ష్మీనారాయణులు.
కామగిరిపీఠము - త్రికోణంలోని అగ్రభాగంతో కామగిరి పీఠమున్నది. దీని అధిపతులు వాగ్భవబీజాధిపతులయిన వాణీ హిరణ్యగర్భులు. ఈ మూడు పీఠాలమధ్యనా ఓడ్యాణ పీఠమున్నది. అదే బిందువు. అక్కడ శివశక్తులుంటారు. ఇక్కడ మూడువైపులా ఉన్న పీఠాలే ముడుశిఖరాలు. మధ్యన ఉన్నది పరమేశ్వరి
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below