లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0054 నామం : స్వాధీనావల్లభా
స్వాధీనావల్లభా : తనకు లోబడిన భర్త గల తల్లికి నమస్కారము.
Swadheena Vallabha : She whose husband surrenders her. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0054 నామం : స్వాధీనావల్లభా
స్వాధీనావల్లభా : తనకు లోబడిన భర్త గల తల్లికి నమస్కారము.
Swadheena Vallabha : She whose husband surrenders her. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0054 నామం : స్వాధీనావల్లభా
"ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీనావల్లభాయై నమః"
ఇది ఆరు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "స్వాధీనావల్లభాయై నమః" అని చెప్పాలి.
స్వ + అధీన = తనకు లోబడిన
వల్లభా = భర్త గలది
"ఏం చేసినా - నాదేంలేదు అంతా మా ఆవిడే అంటాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన అమ్మవారికి స్వాధీన వల్లభుడు. పంచకృత్యాలను నిర్వహించే పరమేశ్వరిని - ఉదాసీనంగా, కేవలం ఒక సాక్షి మాత్రునిగా చూసేవాడు పరమేశ్వరుడు అయినప్పుడు, ఆ పరమేశ్వరుడు స్వాధీనవల్లభుడు కాక మరేమవుతాడు.
పరమేశ్వరి ఆశించేవాటికి, ఆదరించేవాటికి, ఆశీర్వదించేవాటికి, అనుగ్రహించేవాటికి - ఎప్పుడు అభ్యంతరము తెలిపినవాడు కాదు పరమేశ్వరుడు. ఆవిడ చేసే పనులన్నీ సక్రమముగా తప్పులు లేకుండా ఉంటాయి. అందుకనే అభ్యంతరము ఉండదు. అందుకే - ఆయన స్వాధీన వల్లభుడు. 'An obedient wife commands her husband' అంటే 'విధేయురాలైన భార్య భర్తను ఆదేశించ గలదు అని అర్థము. "పరమేశ్వరుడు పరమేశ్వరి స్వాధీనుడు అవటానికి అసలు రహస్యము ఇదే". స్త్రీలు అందరూ ఈ రహస్యాన్ని పరమేశ్వరి నుంచి తెలుసుకోవాలి. అప్పుడు వారికి కూడా భర్తలు స్వాధీనులుఅవుతారు. అంటే పరమేశ్వరిని ఆశ్రయయించిన స్త్రీలకు భర్తలు స్వాధీనులవుతారు అని అర్థము. సభ్యత, సంస్కారం, సహనము, నీతి, నమ్మకము వంటి లక్షణములు ఉన్న భక్తులకు కూడా పరమేశ్వరుడు వసుడైపోతారు. ఈ లక్షణాలు ఉన్న భక్తి ఉన్నత మైనది.
మొత్తము మీద ఈ నామానికి తనకు లోబడిన భర్త గలది, ఇతర స్తీలకు కూడా వారి భర్తలను స్వాధీనము చేయునది అని అర్థము.
మంత్ర ప్రయోగ ఫలితం
భార్యాభర్తల మధ్య ఐకమత్యం లోపించిన వారు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం, మంగళవారం 1008 సార్లు ఉదయం జపిస్తే సయోధ్య కుదురుతుంది. విడాకులు పుచ్చుకొనేంతవరకు వెళ్ళే దంపతులు, 9 రోజులు ఈ మంత్రాన్ని రోజూ 1008 సార్లు జపిస్తే వారు కలసి కాపురం చేస్తారు. తరచుగా నీరసంతో బాధపడేవారు, కళ్ళుతిరిగి పడిపోయే రోగం ఉన్నవారు, ఏ పనీ చేయలేక నిరుత్సాహంతో బాధపడేవారు, మానసిక భీతితో తన మీద తనకు నమ్మకంలేక, దుఃఖించేవారూ ఈ మంత్రాన్ని అమావాస్య పూర్ణిమ, నవమి, గ్రహణ సంక్రాంతులలో భక్తితో 108 సార్లు జపిస్తే పై సమస్యలన్నీ తొలగి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుతారు.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0055 నామం : సుమేరుశృంగ మధ్యస్థా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత