లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0054 నామం : స్వాధీనావల్లభా
స్వాధీనావల్లభా : తనకు లోబడిన భర్త గల తల్లికి నమస్కారము.
Swadheena Vallabha : She whose husband surrenders her. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0054 నామం : స్వాధీనావల్లభా
స్వాధీనావల్లభా : తనకు లోబడిన భర్త గల తల్లికి నమస్కారము.
Swadheena Vallabha : She whose husband surrenders her. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0054 నామం : స్వాధీనావల్లభా
"ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీనావల్లభాయై నమః"
భాష్యం
ఇందాక చెప్పిననామంలో శివుని ఇచ్చాశక్తియే దేవి అని చెప్పటం జరిగింది. కాని ఈ నామంలో తనకు అధీనుడైన కామేశ్వరుణ్ణి భర్తగా పొందినది దేవి అని చెప్పబడుతోంది. శివుని ఆత్మ శక్తికి అధీనము. కాలికాపురాణంలో
నిత్యం వసతి తత్రాపి పార్వత్యా సహధర్మకృత్
మధ్యే దేవీ గృహం తత్ర తదధీనస్తు శంకరః
శివుడు పార్వతితో ఆటలాడుతూ ఉంటాడు. దేవీగృహం మధ్యలో ఉంది. శివుడు ఆమెకు అధీనుడు. ఆగమశాస్త్రాలలో కూడా ఈ విషయం చెప్పబడింది. “లోకంలోని అజ్ఞానులకు భుక్తి ముక్తి కలిగించటానికి చిద్రూపిణి, ఆదిశక్తి అయిన దేవితో శివుడు కలసి ఉన్నాడు” స్కాందపురాణంలో
జగత్కారణమాపన్నః శివో యో మునిసత్తమః
తస్యాపి సా భవేచ్ళక్తిః తయాహీనో నిరర్థకః
ఓ మునివర్యులరా! చరాచర జగత్తుకు కారణభూతుడు శివుడు. అతడికి దేవి శక్తి నిస్తుంది. కాబట్టి దేవిలేకపోతే శివుడులేడు.
ఈ విషయాన్ని శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరిలోని మొదటిశ్లోకంలో వివరిస్తూ
శివః శక్త్యా యుక్తో- యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|
అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి|| 1 ||
ఓ భగవతీ! సర్వమంగళసహితుడైన శివుడు కూడా జగత్తును నిర్మించటానికి శక్తివైన నీతో కలిస్తేనే సమర్థుడవుతాడు. అలాకాకపోతే అనర్హుడవుతాడు. అతడికి కదలటానికి కూడా నేర్పుండదు.
శక్తి లేకపోతే శివుడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి శివుడు కూడా శక్తికి అధీనుడే.
పర్వతరాజు కుమార్తెగా పుట్టిన పార్వతి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై తవాస్మి దాసః నేను నీ దాసుణ్ణి అన్నాడు. అందుచేతనే దేవి స్వాధీనవల్లభ అయింది.
ఈ రకంగా ఆరవనామం నుంచి 54వ నామం వరకు పరమేశ్వరి యొక్క స్థూలరూపాన్ని వర్ణించటం జరిగింది.
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below