శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0053 నామం : శివ
"ఓం ఐం హ్రీం శ్రీం శివాయై నమః"
ఇది రెండు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "శివాయై నమః" అని చెప్పాలి.
శివా = వ్యక్తమైన శివుని రూపము
విశ్వం వ్యక్తం కాక పూర్వం ఒంటరిగా ఉన్న శివుడు 'బహురూపాలుగా వ్యక్తమువుదాం' అనే కోరిక కలిగి, ఆలా ఉచ్చరిస్తే వచ్చిందే - ఈ విశ్వం. ఇలా ఉచ్చరించక పూర్వం 'శివుడ'నే పేరుతొ పిలువబడే శివుడే - ఉచ్చరించిన తరువాత 'శివా' అనే పేరుతొ పిలువబడతాడు. "నేను ఈ రెండు విధాలుగా ఉంటాను అని అమ్మవారితో శివుడు చెప్తాడు (మహనిర్వాణ మంత్రం). శ్రీదేవి ఆరాధనే శివుని సగుణారాధన. శివాకు, శివకు భేదము లేదు. శివుడెట్లో దేవియును అట్లే. దేవి యెట్లో శివుడును అట్లేయని లింగ పురాణము తెలుపుచున్నది. సృష్టికావాలి దైవమే శివుడు. సృష్టియందలి దైవమే శివా.
శివ అంటే పరమేశ్వరుడు శివా అంటే పరమేశ్వరి. ఈ శివ శివా కలయికే ఈ సృష్టి. శ్రీ చక్రం అందు ఉన్న బిందువు అందు ఉన్న శక్తి శివశివా రూపం, సాహస్త్రరం నందు శివా అనే కుండలిని రూపం కలిసేది కూడా శివ అనబడే సాహస్త్రరం.
శివ (శివా) అనగా సమస్తము తన వశమున ఉన్న స్థితి. సమస్తము శివ వశమే. అనగా శ్రీదేవి వశమే అని కూడా అర్థము.
శివ (శివా) అనగా సమస్తము విశ్రాంతి చెందు స్థితి. సృష్టి సమస్తము శ్రీదేవి యందు విశ్రాంతి చెందుతున్నది. శ్రీదేవి శివుని యందు విశ్రాంతి చెందుచున్నది.
శివ (శివా) అనగా మంగళకరం గుణములు అని అర్థము. శ్రీదేవి గుణములు అన్నియు మంగళ కరములే. ఆమెను ఆరాధించువారికి అట్టి గుణములు ప్రసాదించగలదు.
శివ (శివా) అనగా శుభ ప్రారంభము అని కూడా అర్థము. సర్వశుభములకు శివా - శివులే ప్రారంభకులు.
సృష్టిలో ఏ ప్రాణి, సృష్టి లో సృష్టించబడిన ఏది కూడా వీరికి వేరుకాదు వీరి నుండి ఏర్పడినవే. ఈ సమస్త ప్రాణకోటికి, బ్రహ్మాండానికి ఆధారభూతమై శివ శక్తులను సదా ధ్యానించు వారు వారి ధ్యానం లో ఈ శివశివా ఏకత్వం లో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం దర్శించి సృష్టి రహస్యాన్ని తెలుసుకోగలరు అట్టి స్థితి పొందిన యోగి ప్రతి ప్రాణిలోను ఆ దైవ స్వరూపాన్ని దర్శించి చివరికి ఆ శక్తిలోనే లినమైపోతారు, స్వయముగా వారే శక్తి రూపమై సంచరిస్తారు.
మొత్తము మీద ఈ నామానికి శివస్వరూపిణీ, శుభగుణ స్వరూపిణి, ముక్తి స్వరూపిణి అని అర్థాలు చెప్పుకోవచ్చును.
మంత్ర ప్రయోగ ఫలితం
ఇంట్లో అమంగళాలు లేక నష్టాలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఈ మంత్రాన్నీ 108 సార్లు జపిస్తే అకాలమరణాలు రోగాలు, దొంగతనాల వంటి అమంగళాలు తొలగి ఇంటిల్లిపాదీ సుఖాలు పొందుతారు. మోక్షం కావాలనుకొనేవారు నిత్యం యథాశక్తిగా పారాయణ చేయడం మంచిది. భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యానికి నిత్యం 18 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. వాయు పత్ని పేరు శివ. అమ్మవారు ఆ దేవి రూపంలో కూడా ఉంది. కనుక ఊపిరికి సంబంధించిన రోగాలు ఉన్నవారు నిత్యం 54 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఉపశమనం లభిస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0054 నామం : స్వాధీనావల్లభా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation