శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0052 నామం : శివకామేశ్వరాంకస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం శివకామేశ్వరాంకస్థాయై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "శివకామేశ్వరాంకస్థాయై నమః" అని చెప్పాలి.
శివ = శివస్వరూపుడు
కామ = కామస్వరూపుడు అగు
ఈశ్వర = శంకరుని యొక్క
అంక = తొడయందు
స్థా = ఉన్నది.
ఈ నామానికి చాల ప్రాముఖ్యం ఉంది. ఇది అమ్మవారి నివాస స్థలాన్ని గురించి చెప్పేనామం. ఈ నామం లో అయ్యవారైనా ఈశ్వరునికి రెండు నామాలు చెప్పబడ్డాయి. అవి 1. శివుడు 2. కాముడు. శివుడు మంగళ స్వరూపుడు. శుభకరుడు. కాముడు - కామస్వరూపుడు. ఈశ్వరుని - ఈ రెండు రకాల నామాలకు అంతరార్ధాలు ఉన్నాయి. శివకామేశ్వరుని తొడమీద అమ్మవారినివాసమట! సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు "సుధాసింధోర్మధ్యే.... పరమశివ పర్యంక నిలయాం . చిదానందలహరి" అనే 8వ శ్లోకం లో అమ్మవారి నివాసం గూర్చి చెప్తూ "పరమశివపర్యంక నివాసిని" గా వర్ణించి చెప్పారు.
శివునికి తల్లిదండ్రులు లేరు. ఎప్పుడు, ఎక్కడ పుట్టాడో తెలియదు. అందుకే ఆయన ప్రపంచానికే ప్రథముడు. ఈ శివుని నుండియే అమ్మవారు అను భౌతిక ప్రపంచము వ్యక్తమైనది. సంఖ్యాత్మకంగాను, ప్రాదేశాత్మకముగాను గూడ అమ్మవారు ఈ శివుని నుండియే విశ్వముగా విస్తరిల్లింది.
సమస్త కామములకు ఆ దేవి ప్రతి రూపము, ఈ జగత్తు అంతా ఆ కామము(సృష్టి చేయవలెను అన్న కోరిక)నుండి ఉద్భవించి నది. ధర్మ విరుద్ధము కానీ ఏ కోరిక అయినా ఆ తల్లి దయవల్ల నెరవేరుతుంది. అన్ని రూపాలకు ఆధారభూతమై శక్తి ఆ పరమేశ్వరుని ఆశ్రయించి ఉంది. అట్టి శక్తిని చిత్త శుద్దితో ఆరాధించిన. అన్ని శుభములు కలుగుతుంది.
మొత్తము మీద ఈ నామానికి శివస్వరూపుడు, కామస్వరూపుడు అయిన ఈశ్వరుని యొక్క (ఎడమ) తొడ యందు నివాసము గలది అని అర్థము.
మంత్ర ప్రయోగ ఫలితం
చాలాకాలం నుంచి తీరని కోరికలతో బాధపడేవారు ఈ మంత్రాన్ని నిత్యం భక్తితొ రోజూ 18 సార్లు జపిస్తే, ఆ కోరికలు తీరతాయి. ఏ విషయం పైనైనా తొందరగా అవగాహ రావాలని కోరుకొనేవారు ఈ మంత్రాన్ని నిత్యం 11 సార్లు జపించాలి. విజ్ఞానాభివృద్ధి కోరేవారు రోజూ 27 సార్లు పారాయణ చేయాలి. పెళ్ళి తొందరగా అవ్వాలని కోరుకొనేవారు (9 రోజుల పాటు రోజూ 1008 సార్లు పారాయణ చేస్తే సత్వరం వివాహం అవుతుంది)
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0053 నామం : శివా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation