శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0052 నామం : శివకామేశ్వరాంకస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం శివకామేశ్వరాంకస్థాయై నమః"
భాష్యం
దేవి కామేశ్వరుని వామాంకమున ఆసీనురాలయి ఉంటుంది. కామము అంటే కోరిక. కాముడు కోరికగలవాడు. లేక కామ్యరూపుడు కాముడు. అందుచేతనే మన్మథుడికి కాముడు అని పేరు.
కమనీయత్వాత్క్మామః మనోహరరూపము కలవాడు కాముడు. ప్రపంచావిర్భావము కలిగిన వాడు కాబట్టి ఈశ్వరుడు. ప్రజ్ఞానమేవవాకామః కామము అంటే ప్రజ్ఞానము తెలివి.
యదడే తత్ హృదయం మన శ్చైతత్ సంజ్ఞాన మజ్జానం
విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టిః ధృతిః మతిః మనీషా
జాతిః స్మృతి సంకల్పః క్రతురసు
కామోవశ ఇతి సర్వా జ్యే వైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవన్తి
ఏది హృదయమో, ఏది మనస్సో అది
1. సంజ్ఞానము 2. దృష్టి 3. క్రతువు
4 ఆజ్ఞానము 5 మతి 6 ప్రాణము
7 విజ్ఞానము 8. బుద్ధి 9 కామము
10 ప్రజ్ఞానము 11 స్మృతి 12 వశము
13 మేధ 14 సంకల్పము
అని చెప్పబడింది. ఇవన్నీ ప్రజ్ఞానానికి పేర్లు, ఇక్కడ ప్రజ్ఞానము అంటే శివుడు. స్కాందపురాణంలోని బ్రహ్మగీతలో “పండితులచే అనేకవిధముల కీర్తించబడు ప్రజ్ఞానమే శంకరుడు” అని చెప్పబడింది.
దీన్నే కొందరు హృదయము, వశము (స్వాధీనము) అంటారు. ఇవన్నీ శివుడి పేర్లే లోకాలను సృష్టించాలనే కోరిక గల ఆదిదేవుడే శివుడు. అతడు కామశబ్దంతో చెప్పబడుతున్నాడు.
అటువంటి శివకాముడైన ఈశ్వరుని వామాంకమున ఉన్నది ఆ పరమేశ్వరి. ఆమె జ్ఞాని. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము మూడు ఆమెయే.
కామ అనే పదం మంత్రశాస్త్రానికి సంబంధించినది. బాలామంత్రం వాగ్బావ, కామరాజ, శక్తిబీజాల సమ్మేళనం. అలాగే పంచదశీమహామంత్రం మూడుకూటాలుగా ఉన్నది. అవి వాగ్భవ, కామరాజు, శక్తికూటములు. ఈ బీజాక్షరసంకేతాలను సౌందర్య లహరిలోని 32వ శ్లోకంలో శంకర భగవత్సాదులవారు వివరించారు.
ఇప్పుడు పరమేశ్వరి జగత్తును సృష్టించాలనే కోరిక గల పరమశివుని అంకభాగాన
ఆశీనురాలయింది.
శివః శక్తిః కామః - క్షితి రథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్ర-స్తదను చ పరామారహరయః |
అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే - తవ జనని నామావయవతామ్ || 32 ||
దేవీ మంత్రరాజము అయిన, పంచదశాక్షరి, సకలపురషార్ధ, సాధకము.
ఈ శ్లోకములో, పంచదశాక్షరి, సంకేతములతో, చెప్పబడింది.
(షోడశాక్షరి మంత్రము గుహ్యము. గురువు ద్వారా మాత్రమే శిష్యుడు గ్రహించవలెను. కనుక ఈ శ్లోకములో, 15 అక్షరములే చెప్పబడినవి.)
దేవీభాగవతంలో ఈ విషయాన్ని ప్రసావిస్తూ
తస్యోపరి మహాదేవో భువనేశో విరాజితే ।
అక్కడ ఆసనం మీద భువనేశ్వరుడు ఉన్నాడు.
వామాంకే సన్నిషణ్ఞా స్వదేవీ శ్రీభువనేశ్వరీ
అతని యొక్క వామాంకమున పరమేశ్వరి ఆసీనురాలయింది. ఆ దేవి యొక్క కనుసైగతో, కాలి కదలికతో చరాచరజగత్తంతా సృష్టించబడుతోంది. *శివాకారేమంచే పరమశివపర్యంకనిలయాం* అన్నారు శంకరులు తమ సౌందర్య లహరిలో.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below