లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0050 నామం : అనవద్యాంగీ
అనవద్యాంగీ : నిందించుటకు వీలులేని అవయవములు గల తల్లికి నమస్కారము.
Anavadhyaangee : She who has most beautiful limbs which do not lack any aspect of beauty. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0050 నామం : అనవద్యాంగీ
అనవద్యాంగీ : నిందించుటకు వీలులేని అవయవములు గల తల్లికి నమస్కారము.
Anavadhyaangee : She who has most beautiful limbs which do not lack any aspect of beauty. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0050 నామం : అనవద్యాంగీ
"ఓం ఐం హ్రీం శ్రీం అనవధ్యాoగ్యై నమః"
ఇది ఐదు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "అనవధ్యాoగ్యై నమః" అని చెప్పాలి.
అనవద్య+అంగీ = నిందింపబడని, అనగా వంకపెట్టుటకు వీలు లేని అవయవములు గలది.
49 వ నామం "సర్వారుణా" ఈ నామం "అనవద్యాంగీ" తో కలిసినప్పుడు సవర్ణదీర్ఘసంధి వలన "సర్వారుణానవద్యాంగీ" అయి మొత్తం 8 అక్షరాలుగా అనిపిస్తుంది. కానీ విడదీస్తే 4, 5 అక్షరాల చొప్పున ఈ రెండు నామాలు విడి విడిగా ఉంటాయి.
అమ్మవారి సర్వ అవయవాలు సాముద్రికా శాస్త్రం లో చెప్పిన రీతిలోనే సలక్షణంగా, వంక పెట్టడానికి వీల్లేకుండా ఉంటాయి. "అమ్మవారి అవయవముల అమరిక, పొందికలను ప్రమాణంగా తీసుకొనే - సాముద్రికా శాస్త్రం వ్రాయబడింది అని చెప్పడమే ఎక్కువ సత్యం.
సృష్టిలోని అందము మొత్తము ఆ దేవియే అన్నట్టు దర్శించాలి. అందమును ఆరాధన చేయడం వలన ఉపాసకుని యందు కాలుష్యము తగ్గుతుంది. ఆత్మ చైతన్యం కలుగుతుంది, ఇలా దేవిని ఉపాసించే వారిలో కూడా ప్రత్యేకమైన ఆకర్షణ కలుగుతుంది. తేజస్సు ఉంటుంది మొహం ప్రకాశవంతమైన కళ ఉంటుంది. అమ్మవారి అణువణువు అందమే ఆ తల్లి రూపాన్ని అద్భుతమైన ఆకర్షణ తో ధ్యానించి అమ్మలో లేనమైపోతారు. అందువల్ల వారు ఆ తల్లికి స్వయంగా బిడ్డ అయి ప్రపంచంలో ప్రతి అందాన్ని తల్లిని తప్పా వేరే చూడలేరు. ఇంక ఏ అందము అంత కన్నా గొప్పగా కనిపించదు.
అందమును ఆరాధించుట ఉపాసన అవుతుంది, కామించుట దౌర్భాగ్యం అవుతుంది. అదే అశుభము అందమును కామించుట వలన అదే పతనముకు దారితీస్తుంది. లలితా నామాలలో 38 నామాలు అమ్మ అందాన్ని వర్ణించ బడ్డాయ్ ఇదే ఆ కారణము ఉపాసకులు ఉపాసన మొదలు పెట్టగానే తల్లి రూపాన్ని అబ్భతంగా హృదయంలో నింపుకుని ధ్యానం చేయగలగాలి అందుకు ఆ వర్ణన హృదయంలో నిలచి పోవాలి మనో నేత్రంతో ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాలి. తల్లి కన్నా సృష్టిలో ఏది గొప్పగా అనిపించదు అనిపించిన అలా కనిపించిన అందంలో అమ్మాయే గుర్తుకు రావాలి అప్పుడు ఉపాసకుడిలో కామం నశించి ఆత్మ చైతన్యం ఉన్నతి కలుగుతుంది. ఇది ఉపాసనలో మొదటి మెట్టు ఇదే పునాది కూడా...
(భగవంతుడి నామధ్యానం చేస్తున్న వారికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది అది ఏమంటే మామిడి పనస పండు చక్కరకెలి లాంటివి తినప్పుడు నోటికి ఎంత మధురమైన తీపి రుచి కలుగుతుందో, నామాన్ని రూపాన్ని హృదయంలో నిలుపుకొని ధ్యానించే వారికి శరీరం అంతా ఇదే తీపి అనుభూతి కలుగుతుంది మనసు తీపిని రుచి చూస్తుంది. అది వర్ణించ లేని మధురమైన అనుభూతి దానికి నిదర్శనగా "ఓ రామ నీ నామం ఎంత రుచిరా" ఈ గానం అలాంటి అనుభవం నుండి వచ్చినదే. ఒక్కసారి ఆ రుచికి అలవాటు పడిన వారికి ఆ నమామృతము లోనే జీవించాలి అనిపిస్తుంది. నిత్యం నామ స్మరణతో ఆ మాధుర్యాన్ని మీ హృదయానికి రుచి చూపండి. భగవంతుడి నామ స్మరణ తప్పా మిమ్మల్ని ఇంక ఏది కదిలించలేదు. అంటే చంచల భావం కలగదు) ప్రయత్నించండి.
'వంకపెట్టుటకు వీలులేని అవయవములు గలది అని ఈ నామానికి అర్థము'.
మంత్ర ప్రయోగ ఫలితం
ఈ మంత్రం అవయవలోప నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. గర్భవతులు ఈ - మంత్రాన్ని జపిస్తే మంచి పిల్లలు పుడతారు. గర్భవతులు ప్రసవం అయ్యేదాకా వీలున్నపుడల్లా జపించడం మంచిది. కాళ్ళూ, చేతులూ ఇంకా అవయవాల బాధలూ, నొప్పులు ఉన్నవారూ, ఆ అవయవాలను చేతులతో తాకుతూ ఉదయంపూట ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే, బాధలు ఉపశమిస్తాయి.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0051 నామం : సర్వాభరణభూషితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత