లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0050 నామం : అనవద్యాంగీ
అనవద్యాంగీ : నిందించుటకు వీలులేని అవయవములు గల తల్లికి నమస్కారము.
Anavadhyaangee : She who has most beautiful limbs which do not lack any aspect of beauty. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0050 నామం : అనవద్యాంగీ
అనవద్యాంగీ : నిందించుటకు వీలులేని అవయవములు గల తల్లికి నమస్కారము.
Anavadhyaangee : She who has most beautiful limbs which do not lack any aspect of beauty. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0050 నామం : అనవద్యాంగీ
"ఓం ఐం హ్రీం శ్రీం అనవధ్యాoగ్యై నమః"
భాష్యం
అనవద్యములు అంటే నింద్యములు కాని అంగములు గలది.
సులక్షణాన్యంగాని అవయవా యస్యాః సా
మంచి లక్షణములతో కూడిన అవయవయములు గలది. పరమేశ్వరి అవయవాలన్నీ మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. అవి దోషములు లేనివి. సౌందర్యము మనసును హరించేది కాకూడదు. బుద్ధికి పారవశ్యం కలిగించి ఆత్మా నందాన్ని కలిగించేదిగా ఉండాలి. అటువంటి సౌందర్యానికి అనవద్యము అని పేరు. శరీరంలోని అంగాలన్నీ కంటికి కనిపిస్తాయి. అంగాలు అన్నీ ఉన్నా లేకపోయినా అంగి అంటే శరీరము మాత్రము ఉంటుంది. అసలు అంగి గనక లేకపోతే అంగాలుండవు. ప్రపంచంలో కనిపించే వాటన్నింటికీ ఆ పరమేశ్వరియే అంగి, అందుకనే ఈ ప్రపంచం యథాతథంగా నడిచిపోతోంది. ఆ దేవి ఎప్పుడైతే ఈ ప్రపంచాన్నుంచి ఉపసంహరించు
కుంటుందో, అప్పుడు మహాప్రళయం వస్తుంది. సాముద్రిక శాస్త్రంలో చెప్పినట్లుగా ఆ దేవి అన్నీ శుభలక్షణాలతోనే ఉన్నది. ఆమెకు దృశ్యాదృశ్యదోషము ఏమాత్రంలేదు. దృశ్యాదృశ్యదోషములు అంటే
1. అసత్యము 3. జడత్వము 3. పౌరుషేయము 4. పరిచ్చిన్నత్వము
5. అనిత్యము 6. పరాధీనత్వము 7. అసాధ్యము మొదలైనవి.
ఈ దోషములు ఏవీ లేనటువంటిది. అనవద్యులయిన అంగదేవతల సమిష్టిరూపమే అంగి అయిన పరమేశ్వరి.
ఈ అంగదేవతలు
1. హృదయదేవి - సర్వజ్ఞత
2. శిరోదేవి - నిత్యతృప్త
3. శిఖాదేవి అనాదిబోధ
4. కవచదేవి - స్వతంత్రతా
5. నేత్రదేవి - అలుప్తతా
6. అస్త్రదేవి - అనంతా
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below