లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0051 నామం : సర్వాభరణభూషితా
సర్వాభరణభూషితా : అన్ని రకాల ఆభరణాల చేతఅలంకరించబడిన తల్లికి నమస్కారము.
Sarvaabharana Bhooshitaa : She who wears all the trinkets. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0051 నామం : సర్వాభరణభూషితా
సర్వాభరణభూషితా : అన్ని రకాల ఆభరణాల చేతఅలంకరించబడిన తల్లికి నమస్కారము.
Sarvaabharana Bhooshitaa : She who wears all the trinkets. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0051 నామం : సర్వాభరణభూషితా
"ఓం ఐం హ్రీం శ్రీం సర్వాభరణభూషితాయై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "సర్వాభరణభూషితాయై నమః" అని చెప్పాలి.
సర్వ = సమస్తమైన
ఆభరణ = నగలచేత
భూషిత = అలంకరించబడినది
శిరస్సు మీద పెట్టుకునే చూడామణి మొదలు కాలి వ్రేళ్ళకు పెట్టుకునే మట్టెల వరకు సమస్తమైన ఆభరణాల చేత అమ్మవారు అలంకరింపడి వుంటుంది. ఇవన్నీ సౌందర్యకరమైనవి. సౌభాగ్యకరమైనవి. ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క విశేషం, సంకేతం ఉంటాయి. ముత్యం - చంద్రునికి సంబందించినది, ఇది చంద్రనాడి అయిన ఇడా నాడిని సూచించేది. పగడం- కుజగ్రహానికి సంబందించినది. ఇది రక్తాన్ని, ఉష్ణాన్ని, అభయముద్రను సూచిస్తుంది. వజ్రం - శుక్రగ్రహానికి సంబందించినది. ఇది ప్రకాశ వికాసాన్నీ, ప్రమోద ప్రసారాన్ని "వరద" ముద్రను సూచిస్తుంది.
ఇలా ఎన్నెన్నో విశేషాలు, సంకేతాలు ఉంటాయి. ఈ ఆభరణాలలో అన్నీ జాతులు వారు, అన్నీ రీతుల వారు ధరించే ఆభరణాలన్ని అమ్మవారికి ఆభరణాలే! అనగా వెలుగు నిచ్చేవే! సర్వ జగత్తును ఆభరణంగా కలిగినది. జగత్తులో ఏ అందం చూసిన, ఆనందాన్ని కలిగించే - ఏ వ్యక్తిని, ఏ సన్నివేశాన్ని, ఏ వస్తువును చూసినా అన్నీ ఆవిడ ఆభరణాలే!.
ఈ నామానికి సమస్తమైన ఆభరణముల చేత అలంకరింపడినది, సర్వ జగత్తును ఆభరణముగా కలిగినది - అనే అర్థాలు చెప్పుకోవచ్చును.
శ్రీదేవి కాంతియే మూల పదార్థముగా దేవి యొక్క స్త్రీ రూపమును ఊహించినచో సమస్త అంగములు కాంతిమయములుగా గోచరించి ఆభరణములు ధరించినదిగా అగుపించును. శ్రీదేవి అనుగ్రహము పొందిన సిద్ధ జీవులకే అట్టి కాంతి యుండును. ఇక శ్రీదేవి గురించి చెప్పనేల? ఉదాహరణకు సిద్ధుడు, చిరంజీవియగు హనుమంతుడు బంగారువర్ణముతో దగ దగ మెరియుచుండును. ఆ బంగారపు కాంతి అతని సహజ చైతన్య స్థితి. అతని కన్నులు మణిమయ కాంతులను వెదజల్లుచుండును. ఇట్లు దివ్యానుగ్రహము పొందినవారు అందరు సహజ ఆభరణ భూషితులుగా గోచరింతురు. లలితాదేవి విషయమున ఇంకా చెప్పవలసినది ఏమున్నది? ఆమే విశ్వాకాంతి, విశ్వచైతన్యము. ఆమె రూపాత్మిక అయినప్పుడు సర్వాంగములు ఆభరణములు ధరించినట్లు కాంతులు విరజిమ్ముచుండును. దివ్యమంగళరూపులకు ఆభరణములు అలంకారప్రాయములు కావు. వారి అంగసౌష్టవకాంతి ఆభరణములకే శోభచేకూర్చును. అమ్మ సహజ కాంతిని దర్శించు ప్రయత్నము, భక్తులు ఆమెను నలుబదినాలుగు ఆభరణములతో అలంకరింతురు. క్రమశః ఆమె సహజ కాంతిని దర్శింతురు.
అమ్మ తన కాంతితో ఏడులోకములను ఉద్దరించును. స్థితి భేదమును బట్టి ఒక్కొక్క లోకము ఒక్కొక్క వర్ణముగా గోచరించును. అందుచే ఆమే ధరించినటువంటి ఇంధ్రధనస్సువలే ఏడు రంగులు కలిగి యుండును. సప్తలోక సృష్టి ధారణమే అమ్మ ఆభరణములు ధరించినట్లుగా తెలియబడుచున్నది.
మంత్ర ప్రయోగ ఫలితం
ఈ నామము జపించి భక్తులు ఇక్కడ నగలు ఆభరణాలు అంటూ చేసిన వర్ణనను మనసులో ఈ విధముగా ధ్యానించాలి సమస్త శుభములు ఆమెకు ఆభరణాలు, సృష్టి లోని శుభ లక్షణాలు ఆమెకు అలంకారాలు. ఎవరైతే తల్లిని మనోనేత్రంతో దర్శిస్తూ మానస పూజ చేస్తారో వారు భక్తి ఆభరణాలు చేత అలంకరించు కున్న వాళ్ళు వారికి ఆ భక్తి ఆభరణాలు మహా కాంతి తేజసుతో వెలిగిపోతారు. అట్టి మహా భక్తులు అమ్మవారి కి ఆభరణాలు. అలాంటి భక్తులు అమ్మవారికి విలువైన కాంతులు.
నిరాధార, నిరాకార నిర్గుణ సత్య స్వరూపినికి ఆభరనాలు అంటే అది నిరంహంకార, నిత్యచైతన్య, నిత్యా ఆరాధన, నిత్య స్మరణతో ఉండే భక్తులే (నీ నామము సదా స్మరామి) తల్లి పాదములను హృదయములో నింపుకుని అర్చన చేయడం అలవాటు కావాలి. ధ్యానంలో ఏకాగ్రత కుదరని వారు అమ్మవారి పాదాలని ధ్యానం చేయండి ఏకాగ్రత కుదురుతుంది.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0052 నామం : శివకామేశ్వరాంకస్థా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత