లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0049 నామం : సర్వారుణా
సర్వారుణా : అంతటా ఎరుపు రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము.
Sarvaaruna : She who has light red colour of the dawn in all her aspects. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0049 నామం : సర్వారుణా
సర్వారుణా : అంతటా ఎరుపు రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము.
Sarvaaruna : She who has light red colour of the dawn in all her aspects. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0049 నామం : సర్వారుణా
"ఓం ఐం హ్రీం శ్రీం సర్వారుణాయై నమః"
ఇది నాలుగు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "సర్వారుణాయై నమః" అని చెప్పాలి.
సర్వ + అరుణ = సర్వారుణా = సర్వము అరుణ వర్ణముగా భాసించునది.
అమ్మవారి పాదపద్మాల నుండి వెలువడే కిరణ పుంజములనే ప్రపంచము అంతా నిండి ఉంటుంది. ఆమె శరీరఛాయ - ఎఱుపు ,ధరించే ఆభరణాలు - ఎఱుపు, దంతాల చిగుళ్లు - ఎఱుపు, కట్టిన వస్త్రం - ఎఱుపు, పెదవులు - ఎఱుపు, ఇలా సర్వం అరుణామయం (సరస్వతి దేవి అయితే సర్వం శుక్లా వర్ణం). ఆమె సాన్నిధ్య ప్రకాశం సహస్ర సూర్యోదయాల సమన్వయము. ఆమె హిరణ్యవర్ణ. సర్వము అరుణమవడం వలన ఆమె "సర్వారుణా". ఇలా ఉండటం ఆమె నిష్పక్షపాత అనురాగ ప్రభకు నిదర్శనం. అరుణవర్ణం చైతన్యాన్ని, అనురాగాన్ని, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. అమ్మవారు ఈ లక్షణాలు వున్నది కాబట్టి "సర్వారుణా".
సర్వము అరుణవర్ణముగా భాసించునది, చైతన్యా రాశి, అనురాగపు ముద్ద - అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు.
మంత్ర ప్రయోగ ఫలితం
ఈ నామజపం అనేక ప్రయోజనాలతో కూడినది కుజదోష నివారణకు ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం 108 సార్లు జపిస్తే 9 వారాలలో, దోషం తొలగిపోతుంది. అజీర్ణవ్యాధి వల్ల వచ్చే కడుపుబ్బరానికి, వాయుబాధకు అన్నం తినేముందు, తిన్న తరువాత ఈ మంత్రానికి పదకొండుసార్లు చేస్తే బాధ ఉపశమిస్తుంది. ఆరోగ్యానికి నిత్యం ఈ మంత్రం 36సార్లు జపించుకోవడం మంచిది. కంటిచూపు మెరుగుపడడానికి సూర్యోదయ కాలంలో ఈ నామాన్ని 108 సార్లు జపించుట మంచిది.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత