లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0049 నామం : సర్వారుణా
సర్వారుణా : అంతటా ఎరుపు రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము.
Sarvaaruna : She who has light red colour of the dawn in all her aspects. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0049 నామం : సర్వారుణా
సర్వారుణా : అంతటా ఎరుపు రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము.
Sarvaaruna : She who has light red colour of the dawn in all her aspects. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0049 నామం : సర్వారుణా
"ఓం ఐం హ్రీం శ్రీం సర్వారుణాయై నమః"
భాష్యం
వసన, ఆభరణ, కుసుమ, కాంత్యాధికం సర్వమేవ అరుణం యస్యాః
వస్త్రము, ఆభరణము, పుష్పము, కాంతి మొదలైనవన్నీ ఎర్రగా గలిగినది.
పరమేశ్వరి ధరించే ఆభరణాలు, పుష్పాలు మేనిపూతలు అంటే శరీరానికి రాచుకునే చందనము కూడా అన్నీ ఎర్రరంగులోనే ఉంటాయి.
కుంకుమపూవులాంటి ఎర్రని వస్త్రం. రక్తచందనం, ఎరుపుదనం గల మాణిక్యాలు. (పద్మరాగాలు) మందారపూలు. అందుకే దేవిని సర్వారుణా అంటారు.
అంబా పదాంబుజోద్భూత ప్రారుణ్య రసపూరితం ।
సర్వారుణం జగ ద్భాతి తన్మయత్వం ప్రతీయతే ॥
పరమేశ్వరి వేలకొలది ఉదయభానుల కాంతులు గలది. ఈమె కామకలా స్వరూపిణి.
విమర్శరూపిణి. జ్యోతిర్మయి.
అరుణవర్ణము ఆనందకరము. పరమేశ్వరిని సర్వారుణగా ఉపాసించటము చరాచర జగత్తుకూ వశీకరణము. మంత్రరత్నాకరంలో
రత్నాం వశ్యే, స్వర్ణవర్దాం స్తంభనే, మారణే౭_ సితాం
ఉచ్చాటనే ధూమ్రవర్దాం, శాంతాశ్వేతాం స్మరే దుమామ్ ॥
అని మంత్ర రత్నాకరంలో చెప్పబడింది.
రత్నము అంటే మాణిక్యము. అది ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి రత్నము అంటే ఎరుపు వర్ణము అని అర్ధం.
ఎరుపురంగు - వశ్యము
బంగారురంగు - స్తంభనము
నలుపురంగు - మారణము
దూమ్రవర్ణము - ఉచ్చాటన
తెలుపురంగు - శాంతి
అందుచేత దేవి ఎరుపువర్ణంలో ఉన్నది అంటే అదిలోకవశ్యము అని గుర్తించాలి. దేవిని స్తుతిస్తూ సకుంకు విలేపనాం.... అరుణ మాల్యభూషాంబరాం, జపాకుసుమ భాసురాం... అన్నారు. అంటే ఆమె ఎరుపురంగు వస్త్రాలు, ఆభరణాలు ధరించి ఉంటుంది.
ఎర్రనిచ్చాయతో నిగనిగలాడుతుంటుంది. అందుకే ఆధారచక్రంలో భైరవీ భైరవులను
ధ్యానించేటప్పుడు
జపాకుసుమసంకాశా మధుఘూర్తితలోచనౌ
జగతః పితరౌ వందే భైరవీ భైరవాత్మకౌ॥ అంటారు.
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below