లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0048 నామం : మహాలావణ్య శేవధిః
మహాలావణ్య శేవధిః : అతిశయించిన అందమునకు గనియైన తల్లికి నమస్కారము.
Mahaa Laavanya Sheadhi : She who has the accumulation house of supreme beauty. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0048 నామం : మహాలావణ్య శేవధిః
మహాలావణ్య శేవధిః : అతిశయించిన అందమునకు గనియైన తల్లికి నమస్కారము.
Mahaa Laavanya Sheadhi : She who has the accumulation house of supreme beauty. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0048 నామం : మహాలావణ్య శేవధిః
"ఓం ఐం హ్రీం శ్రీం మహాలావణ్యశేవధయేనమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "మహాలావణ్యశేవధయేనమః" అని చెప్పాలి.
ఈ నామాంతం లో గల 'శేవది' అనే పదం పుంలింగ పదం. స్త్రీలింగ పదమైతే శేవధ్యాయి నమః అనాలి గాని పుంలింగ పదం కాబట్టి శేవధయేనమః అనే చెప్పాలి.
మహాలావణ్య = అతిశయించిన అందమునకు,
శేవధిః = గని లేదా నిది.
అమ్మవారు చైతన్యంతో కూడిన అద్భుతమైన సౌందర్యనిధి. నిండియున్న దానిని నిధి అంటారు. జగత్తు అంతటా నిండి ఉన్నది కాబట్టి అమ్మవారు నిధి. జగత్తులో ఎక్కడో ఒక్కచోటే అమ్మవారు కనబడదు. అంతా ఆమె లోనే ఉన్నది. వస్తువులద్వారా, వ్యక్తులద్వారా ఆమెలో ఒక ఆకారం, పరిధులు, పరిమాణాలు ఏర్పడుతున్నాయి గాని ఇవేవి లేకపోతె అంతా ఆవిడే! అందుకని ఆమె నిధి. అయితే మామూలు నిధి కాదు. సౌందర్య నిధి, లావణ్య నిధి. చైతన్యం తో కూడిన సౌందర్యమే లావణ్యన్నీ సూచిస్తుంది . సందర్భాన్ని బట్టి వ్యక్తులకు ఒక విశేషం వస్తుంది. ఈ సందర్భాలు వయస్సు, చేతనత్వము అయితే - ఆ వ్యక్తి లో వచ్చేది లావణ్యము. ఎంత అందాలరాశి అయినా చలించని అందం ఫలించదు ఈ చలించే అందంతో ప్రపంచమంతా ఆమే నిండి ఉంటుంది. ఆమె అరుణారుణ కాంతి కిరణాలే ప్రపంచమంతా నిండి, వివిధ రూపాలుగా వ్యక్తమవుతున్నాయి. అలాంటి చైతన్య, సౌందర్య, సౌజన్య, సౌకుమార్య, లావణ్య నిధి ఆమె.
'అతిశయించిన అందానికి గని (లేదా నిధి ) వంటిది' అని ఈ నామానికి అర్థము.
మంత్ర ప్రయోగ ఫలితం
ఆడవారు రోజు ఈ మంత్రాన్ని రాత్రి పడుకోబోయే ముందు 108 సార్లు జపం చేస్తే చాల ఆకర్షణీయంగా కనిపిస్తారు. వార్ధక్యప్రభావం శరీరం మీద పడకుండా చురుకుగా ఉండాలి అనుకునేవారు రాత్రి పడుకోబోయే ముందు జపించుకోండి. చక్కని ఫలితం వస్తుంది.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత