లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0048 నామం : మహాలావణ్య శేవధిః
మహాలావణ్య శేవధిః : అతిశయించిన అందమునకు గనియైన తల్లికి నమస్కారము.
Mahaa Laavanya Sheadhi : She who has the accumulation house of supreme beauty. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0048 నామం : మహాలావణ్య శేవధిః
మహాలావణ్య శేవధిః : అతిశయించిన అందమునకు గనియైన తల్లికి నమస్కారము.
Mahaa Laavanya Sheadhi : She who has the accumulation house of supreme beauty. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0048 నామం : మహాలావణ్య శేవధిః
"ఓం ఐం హ్రీం శ్రీం మహాలావణ్యశేవధయేనమః"
భాష్యం
పరమేశ్వరి మిక్కిలి సౌందర్యవతి
మహతో లావణ్యస్య అతిశయ సౌందర్యస్య, శేవధిః = నిధిః |
దేవి అతిశయించిన సౌందర్యానికి నిధి. శేవధి అంటే నిధి అని అర్ధము. లావణ్యము అంటే సౌందర్యము చక్కదనము, ముత్యములందువలె నయనముల యందు నీడ ప్రతిఫలించునట్టి కాంతి విశేషము. అని చెబుతోంది సూర్యరాయాంధ్ర నిఘంటువు. ఇక్కడ లావణ్యము అనే పదానికి ముత్యముల యందలి నిగనిగ చాయ అని అర్ధం తీసుకోవాలి. దేవి లావణ్యనిధి.
ఆమెను మించిన సౌందర్యము, లావణ్యము మరెక్కడా లేదు. ప్రకృతిలోని సౌందర్యమంతా దేవి సౌందర్యము నుంచి వచ్చినదే. పరమేశ్వరి సౌందర్యం నిరుపమానము. ఆ సౌందర్యము చెక్కు చెదరదు. మిగిలిన సౌందర్యమంతా వికారం చెందుతుంది. అనగా ఈ జగత్తులోని అందంగా కనిపించే ఏ వస్తువుకూ ఆ అందం శాశ్వతం కాదు. అది నశిస్తుంది. కాని పరమేశ్వరి సౌందర్యం మాత్రం శాశ్వతమైనది. లౌకికమైన సౌందర్యం మెరుపుతీగలాగా అశాశ్వతం. క్షణభంగురము. దేవి సౌందర్యం మాత్రమే శాశ్వతమైనది. అందుకే ఆమె సౌందర్యనిధి. మహాలావణ్య శేవధి. అని చెప్పబడింది.
దేవి జగద్వ్యాప్తమైన శరీరచ్చాయ గలది. రక్త శుక్ల కాంతే లావణ్య సూచకము. అంటే పరమేశ్వరి ఆ రక్తవర్ణంలో ఉంటుంది. అదే జపాకుసుమచాయ మంకెన్న పూవులాగా, దానిమ్మపూవులాగా ఎరుపు తెలుపు కలిసిన పాటల వర్ణంలో ఉంటుంది. అదే అరుణ వర్ణము. ఆ కాంతే లావణ్య శూచకము. ఇక్కడ మహా అంటే బ్రహ్మ అని లావణ్యము అంటే ఆనందం అని కూడా అర్ధం చెబుతున్నారు. మహాలావణ్యము అంటే బ్రహ్మానందము. శేవధి అంటే నిధి. పరమేశ్వరి బ్రహ్మానందానికి నిధి. ఆమెను
సేవించినవారు బ్రహ్మనందం పొందుతారు. మరి బ్రహ్మానందము అంటే ఏమిటి?
“బ్రహ్మానందము” అనే దాన్ని తైత్తిరీయోపనిషత్తులో వివరించారు.
ఈ లోకంలోని సంపద అంతా యువకుడు, సదాచార సంపన్నుడు, వేదాధ్యాయి, బలమైనవాడు అనుభవించటానికే ఉన్నది. దీనిని అనుభవించటంవలన కలిగే ఆనందము మానుషానందము.
మానుషానందానికి నూరు రెట్లు - మనుష్య గంధర్వానందం. మానుష గంధర్వులంటే మానవులై ఉండి పుణ్యకర్మలచేత గంధర్వత్వం పొందినవారు. మనుష్య గంధర్వానందానికి నూరురెట్లు దేవగంధర్వానందం. దేవగంధర్వులంటే సృష్టికాలంలో దేవలోకంలో గంధర్వులుగా జన్మించినవారు. దేవగంధర్వానందానికి నూరురెట్లు - చిరలోక పితరానందం. చిరకాలం ఉండే లోకంలో ఉన్న పిత్రుదేవతలను చిరలోక పితరులు అంటారు.
చిరలోక పితరానందానికి నూరురెట్లు - అజానజ దేవానందము. ఈ లోకం దేవలోకానికి పైన ఉన్నది.
అజానజదేవానందానికి నూరురెట్లు - కర్మదేవానందము. వైదిక కర్మలు చేసినవారు కర్మదేవతలు.
కర్మదేవానందానికి నూరురెట్లు - దేవానందము. యజ్ఞంలో హవిర్భాగము తీసుకునే 38 మంది దేవతలు.
దేవానందానికి నూరురెట్లు - ఇంద్రానందం
ఇంద్రానందానికి నూరురెట్లు - బృహస్పతి ఆనందం
బృహస్పతి ఆనందానికి నూరురెట్లు - ప్రజాపతి ఆనందం
ప్రజాపతి ఆనందానికి నూరురెట్లు - బ్రహ్మనందము
పరమేశ్వరిని సేవించేవారు ఈ రకమైన బ్రహ్మానందాన్ని పొందుతారు.
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below