లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0047 నామం : మరాళీ మందగమనా
మరాళీ మందగమనా : ఆడు హంసవలె ఠీవి నడక కలిగిన తల్లికి నమస్కారము..
Maraali Mandha Gamanaa : She who has the slow gait (manner of walking) like the female swan. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0047 నామం : మరాళీ మందగమనా
మరాళీ మందగమనా : ఆడు హంసవలె ఠీవి నడక కలిగిన తల్లికి నమస్కారము..
Maraali Mandha Gamanaa : She who has the slow gait (manner of walking) like the female swan. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0047 నామం : మరాళీ మందగమనా
"ఓం ఐం హ్రీం శ్రీం మరాళీ మందగమనాయై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం . ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "మరాళీమందగమనాయై నమః" అని చెప్పాలి. "మరాళి" అని "మందగమనా" అని విడదీసి చెప్పకూడదు. అలా విడదీస్తే అమ్మవారిని "ఆడహంసతోను", "మందగమనముతోను" పోల్చినట్లవుతుంది.
అమ్మవారి నడకలో హడావుడి, తత్తరపాటు ఉండవు. పక్షులన్నిటిలో ఉత్తమజాతిలక్షణాలు కలవి హంసలు. ఆ హంసల నడక ఠీవీగా, నిదానంగా వుంటుందిట! స్త్రీలకు ఆడుహంసల నడకలు ఉండటం ఉత్తమజాతి స్త్రీ సాముద్రికా లక్షణం. మందగమనమే మగువలకు మర్యాదలంకారం.
కుండలినీ శక్తి యొక్క సుషుమ్నా మార్గ ఊర్ధ్వగమనం - నిదానంగానే ఉండటం - ఉత్తమ ఉపాసనా లక్షణం. 'తక్కువ కాలంలోనే కుండలినీ శక్తిని సహస్రారంలోని శివునితో కలిపి ముక్తిని సాధిద్దాం' అనే తొందరపాటు స్వభావం ఉండకూడదు. ఈ లక్షణం వ్యాపార లక్షణం అవుతుంది కానీ ముముక్షువు లక్షణం కాదు.
శ్వాసలోని 'సో' 'హం' అనే అక్షరాలనే "హంస" అనే పక్షితో సంకేతిస్తారు. అమ్మవారి హంస గమనము మనయందలి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా గమనించవలెను. సూక్షముగా, మందముగా, మంద్రముగా జరుగు సూక్ష్మస్పందన మీద జీవి ఆయుర్ధాయం ఆధారపడి వుంటుంది. త్వరితగతిలో శ్వాసక్రియ ఉంటే - ఆయుర్ధాయ కాలం తగ్గిపోతుంది. కాబట్టి ఈ శ్వాస అనే - 'హంస గమనం' నిదానంగానే జరగాలనే ఈ నామం సూచిస్తుంది.
మంత్ర ప్రయోగ ఫలితం
పిల్లల ప్రవర్తన బాగుపడడానికి ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు చొప్పున రోజులు జపించండి. శత్రువులు మిత్రులుగా మారడానికి ఆదివారం ఈ మంత్రం 10 సార్లు జపించండి. అమ్మవారి సాక్షాత్కారం కావాలని కోరేవారు రోజూ 11 సార్లు "ఓం ఐం హ్రీం శ్రీం మరాళీ మందగమనాయై నమః” అని జపించండి. చక్కని ఫలితం వస్తుంది.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0048 నామం : మహాలావణ్య శేవధిః
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత