లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0047 నామం : మరాళీ మందగమనా
మరాళీ మందగమనా : ఆడు హంసవలె ఠీవి నడక కలిగిన తల్లికి నమస్కారము..
Marali Mandha Gamana : She who has the slow gait (manner of walking) like the female swan. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0047 నామం : మరాళీ మందగమనా
మరాళీ మందగమనా : ఆడు హంసవలె ఠీవి నడక కలిగిన తల్లికి నమస్కారము..
Marali Mandha Gamana : She who has the slow gait (manner of walking) like the female swan. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0047 నామం : మరాళీ మందగమనా
"ఓం ఐం హ్రీం శ్రీం మరాళీ మందగమనాయై నమః"
భాష్యం
మరాళో హంసః, సఃస్వభావా దేవ మందగతిః
మరాళము అంటే హంస. ఇది పక్షిజాతిలో ఉత్తమమైనది. సహజంగానే ఇది మెల్లగా నడుస్తుంది. అందులోనూ ఆడు హంస ఇంకా మెల్లగా నడుస్తుంది. ఆడు హంసలాగానే పరమేశ్వరి కూడా అతిమెల్లని నడక గలది. మందగమనము అనేది ఉత్తమజాతి స్త్రీ లక్షణము.
హంస అంటే పరమాత్మ, యోగవిశేషము, శరీరవాయు విశేషము, మంత్రవిశేషము, అని సూరాయాంద్ర నిఘంటువు చెబుతోంది.
మూలాధారంలో బయలుదేరిన ఈ హంస సుషుమ్నా నాడిద్వారా సహస్రారానికి చేరుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మూలాధారానికి వస్తుంది. ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. ఇది మందగమన, శరీరంలో కోపము, భయము, శృంగారము ఎక్కువైనప్పుడు దీని గమనం పెరుగుతుంది. మిగిలిన సమయాలలో దీని గమనం చాలా మందంగా ఉంటుంది. జపతపాదులందు మరీ మందంగా ఉంటుంది. హంస స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరి అందుచేతనే మందగమన.
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below