శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0046 నామం : శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజ
"ఓం ఐం హ్రీం శ్రీం శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయై నమః"
ఇది పదహారు అక్షరాల నామం . ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజయై నమః " అని చెప్పాలి .
శింజాన= ధ్వనిచేయుచున్న ,
మణిమంజీర = మణులుగల అందెలచేత ,
మండిత = అలంకరింపబడిన ,
శ్రీ = శోభగల ,
పదాంబుజ = పద్మములవంటి పాదములు గలది అమ్మవారి మస్తకము నుండి పాదములవరకు గల అన్ని అవయవాలు సౌందర్యవంతమే కాదు, చైతన్యవంతము కూడా! పద్మాల లాగా అందమైనవి మాత్రమే కాక అమ్మవారి పాదాలు మణిమంజీర మండితాలు. అంటే - మణులు పొదిగిన అందెలతో అలంకరింపబడి ఉంటాయి. ఈ అందెలు మళ్ళీ చిఱు గజ్జెలను గూడ కలిగి వుంటాయి. అందువలన అమ్మవారి పాదం ఏ మాత్రం కదిలిన శ్రవణానంద కరంగా ఉంటుంది. భక్తుల కోర్కెలను మించి ఇవ్వగలిగిన సామర్ఢ్యము అమ్మవారి పాదాలకు వుంటుందని శంకరులువారు సౌందర్యలహరిలోని "త్వదన్యహః పాణిభ్యాం..." అనే 4వ శ్లోకంలో "శరణ్యేలోకానాం తవహిచరణావేవ నిఫుణవు" అన్నారు . ఇటువంటి పాదాలకు పూజచేస్తే పూజనీయులని అందరికీ పూజజరిగినట్లే అవుతుంది. ఎందుకంటే ఆ పూజనీయులందరు శిరస్సులు వంచి అమ్మవారు పాదం ఆనిచ్చిన పీఠం చుట్టూ ఎప్పుడు మ్రొక్కుతూ వుంటారు కాబట్టి.
ఈ నామంలోని "శ్రీ పదాంబుజా" అనే సమాసం అమ్మవారి రెండు పాదాలను సూచిస్తుంది. ఈ సమాసాన్ని 'శ్రీపద + అంబుజా' అని రెండు పదాలుగా విడదీస్తే అప్పుడు - ఈ పదాలలోని మొదటి పదం 'శ్రీపద' రెండో పదం 'అంబుజా' అవుతాయి. ఇవే అమ్మవారి రెండు పాదాలు. ఈ రెండు ముక్తిని, భుక్తిని ప్రసాదించేవిగా కూడా గ్రహించవచ్చును.
మంత్ర ప్రయోగ ఫలితం
అమ్మవారి పాదపద్మాలను భక్తితో ధ్యానిస్తే సకల సంకటాలు నశిస్తాయి. అనవసరంగా అనగా చేయని తప్పుకు చెరసాల పాలైనవారు / పొందినవారూ ఈ మంత్రాన్ని కష్ట కాలంలో యథాశకిగా జపిస్తే అపఖ్యాతి తొలగి చెరసాలలో నుండి విముక్తులౌతారు.
విద్యాభివృద్ధికి రోజూ 11 సార్లు ఈ మంత్రం జపించుకొంటే చక్కని అభివృద్ధి కలుగుతుంది. విదేశాలలో ఏవైనా కేసులలో ఇరుక్కుని మన దేశాలకు రాలేనివారి రోజు 1008 సార్లు చొప్పున 9 రోజులు జపంచేస్తే, కేసు పరిష్కారమై మన దేశానికి తిరిగివస్తారు. ఈ మంత్ర జపం సకల శుభాలను ఇస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0047 నామం : శింజానమణిమంజీరమండిత శ్రీ పదాంబుజా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation