శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0044 నామం : నఖదీధితిసంఛన్నసమజ్జనతమోగుణ
"ఓం ఐం హ్రీం శ్రీం నఖదీధితిసంఛన్నసమజ్జనతమోగుణాయై నమః"
ఇది పదహారు అక్షరాల నామం . ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "నఖదీధితిసంఛన్నసమజ్జనతమోగుణయై నమః" అని చెప్పాలి.
నఖ = గోళ్ళ యొక్క,
దీధితి = కాంతులచేత,
సంఛన్న = చక్కగా కప్పివేయబడిన,
నమత్ = నమస్కరించుచున్న,
జన = జనుల యొక్క,
తమోగుణ = అజ్ఞానం కలది.
(ఈ అర్థాల వరుసను సరిగా అర్థం చేసుకోవాలి లేకపోతే, "అమ్మవారు అజ్ఞానం కలది ఏమిటా" అని అనిపిస్తుంది)
అమ్మవారి పాదాలకు - కిరీటాలతో దేవతా మూర్తులందరు నమస్కరిస్తూ వున్నప్పుడు, వారి కిరీటాల్లో పొదగబడిన వివిధ రత్నాలు అమ్మవారి పాదాలకు ఉండే గోళ్లకు తగిలి, ఆ గోళ్ళు సానబెట్టినట్లు అవుతాయి. సహజంగానే కాంతులు విరజిమ్మే అమ్మవారి కాలిగోళ్ళు - ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతాయి. అలాంటి గోళ్ళు కలిగిన అమ్మవారి పాదాలకు శిరస్సు వంచి ప్రణమిల్లే వారికి - వారి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేయగల ప్రజ్ఞాన కాంతులు అమ్మవారి పాదనఖాలకు వుండవా మరి.
అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైన వుండి, చక్రాలపై అనంతమైన అమృత కిరణాలను వర్షిస్తాయి. అయితే ఆ కిరణాల్లో అగ్నికి సంబంధమైన 108, సూర్య సంబంధమైనవి 116, చంద్ర సంబంధమైనవి 136 చొప్పున మొత్తం 360 కిరణాలు మాత్రమే ఆ షట్చక్రాలు గ్రహిస్తాయి. ఈ 360 కిరణాలే సంవత్సరానికి రోజులు. తనకు నమస్కరించు జనుల యొక్క అజ్ఞానము అను చీకటిని పోగట్టగల కాలిగోళ్ళ కాంతులు కలది - అని ఈ నామానికి అర్థము
మంత్ర ప్రయోగ ఫలితం
రోజూ విద్యా ప్రారంభానికి ముందు ఈ మంత్రం 11 సార్లు చదివితే చాలు. కొన్ని విద్యలు (సబ్జెక్ట్స్) సరిగ్గా అర్ధంకానివారు వాటిని చదివే ముందు ఈ మంత్రం జపిస్తే, ఆ విద్యలు కరతలామలకం అవుతాయి. పిల్లల చేత జపం చేయిస్తే విద్యావంతులౌతారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0045 నామం : పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation