శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0043 నామం : కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా
"ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః"
ఇది పన్నెండు అక్షరాల నామం . ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "కూర్మపృష్ఠ జయిష్ణుప్రపదాన్వితాయై నమః" అని చెప్పాలి. అంతేగాని కూర్మపృష్టా అని విడతీయరాదు. అలా ఆ నాలుగు అక్షరాలూ విడతీస్తే అమ్మవారిని తాబేలు వీపుతో పోల్చినట్లువుతుంది.
కూర్మ = తాబేలు యొక్క,
పృష్ఠ = ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును,
జయిష్ణు = గెలుచుస్వభావముగల,
ప్రపద = పాదాగ్రములు (పారాణి పెట్టే పాదాల ఉపరితల భాగాలు),
అన్వితా= కూడినది లేదా కలిగినది.
అమ్మవారి పాదముల పై భాగము తాబేలు డిప్పలవలే చతుర్దశ భువనములకు ఆధారము. పదునాలుగు లోకములకు రక్షణప్రదము. అమ్మ పాదములను ఆశ్రయించి పూజించేవారికి సర్వజయములు కలుగును. పదునాలుగు లోకములలో అమ్మకు ఎదురు లేదు. అట్లే అమ్మ పాదాలను ఆశ్రయించినవారకి కూడా అట్టి "జయిష్ణు" తత్వము లభించును. కూర్మపృష్ఠములను (పైన తెలిపిన అమ్మవారి పాదాలను) పూజించేవారిని - ఎప్పుడైనా, ఎన్నిసార్లయినా, ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగలదు. అందుకనే అమ్మవారిపాదాలు మహనిర్వాణ సౌభాగ్యదాయినులు. పూజ అంతయు పాదములకే జరుపుటలోగల పరమార్థము ఇదే.
సంసార సముద్రములో మునుగు మందర పర్వతము వంటి భౌతిక తత్వ జీవులను గూడ - ఆదికూర్మమును మించి ఉద్దరించి, మోక్షమునిచ్చు సామర్ధ్యము గల పాదములు కలది. మోక్షప్రదమైన అమ్మవారి పాదాలను సూచించే బీజాక్షరం - సౌః
మంత్ర ప్రయోగ ఫలితం
శత్రుభయం ఎక్కువైనపుడు, మన ఇంటికీ, స్థలానికీ, మనకీ కుటుంబ సభ్యు రక్షణ లేదని భయపడేవారు, ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు చొప్పున 27 రోజులు జపిస్తే సకల భయాలు తొలగి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా స్థలాలు, పొలాలు, కొనుగోలులో కోర్ట్ కేసులలో ఇరుక్కుపోయి పరిష్కారం లభించనప్పుడు ఈ మంత్రం 41 రోజులలో రోజూ 108 జపిస్తే మనకు అనుకూలంగా తీర్పువస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0044 నామం : నఖదీధితిసంఛన్నసమజ్జనతమోగుణ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation