లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0042 నామం : గూఢగుల్ఫా
గూఢగుల్ఫా : నిండైన చీలమండలు గల తల్లికి నమస్కారము.
Goodagulphaa : She who has round ankles. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0042 నామం : గూఢగుల్ఫా
గూఢగుల్ఫా : నిండైన చీలమండలు గల తల్లికి నమస్కారము.
Goodagulphaa : She who has round ankles. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0042 నామం : గూఢగుల్ఫా
"ఓం ఐం హ్రీం శ్రీం గూఢగుల్ఫాయై నమః"
ఇది నాలుగు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "గూఢగుల్ఫాయై నమః" అని చెప్పాలి.
గూఢ = నిండైన,
గుల్ఫా =చీలమండలు కలది.
'గూఢగుల్ఫా' అనగా ఇంపైన చీలమండలు కలది అని అర్థము. ఐతే గూఢ అనగా "రహస్యమైన" అనే అర్థం కుడా ఉంది. (ఉదా : గూఢచారులు) ఈ రెండో అర్థాన్ని బట్టి అమ్మవారి చీలమండల 'రహస్యంగా' అంటే కనబడకుండా ఉంటాయి అని అర్థము.
రహస్యంగా రక్షించుట ఇహ జీవనమందలి సమస్యనుండి యే కాక ఇహము నుండి కూడా రహస్యముగా శ్రీ దేవి రక్షించ గలదు.ఆమె మూల ప్రకృతి ఆమె నుండియే అష్ట ప్రకృతులు ఉద్భవించినవి. ఆమె అవ్యక్తమగు వ్యక్త రూపమే.అష్ట ప్రకృతులు ఆవర్ణములు సృష్టించగా ఆమె అవ్యక్తముగా మొదటి ఆవరణగా నిలిచినది ఆమె పరా ప్రకృతి. ఆమె నుండి ఉద్భవించింది అపర ప్రకృతులు, అపర ప్రకృతి నుండి దాటించి పరా ప్రకృతి అనుభమునిచ్చి అవ్యక్తమునకు గోనిపోవు సమర్థురాలు శ్రీ దేవి. అమ్మవారి ఆరాధన సకల శుభములను రహస్యముగా అందించును, అమ్మ రక్షించును అని ధ్యానించిన వారికి తప్పక రక్షించును.
చీలమండలను ఒకదానిపై ఒకటి పేర్చి, గుదము క్రిందుగా నుంచి సిద్ధాసనము వహించి ధ్యానించువారికి ప్రకృతి సహకరించి ప్రజ్ఞను ఊర్ధ్వగతి చేర్చి, ఆజ్ఞయందు స్థిరపరచునని హఠయోగము బోధించుచున్నది. ఇది కుండలిని ప్రచోద రహస్య విద్య. దీనికి అధిదేవత కుడా అమ్మయే.
మంత్ర ప్రయోగ ఫలితం
ఈ మంత్రాన్ని 11 రోజుల పాటు వారి బాగుకోరి 1000 సార్లు జపిస్తే మంచి నడవడిక లభిస్తుంది. ఈ మంత్రానికి మరొక అర్ధం ధ్యానించే వారిని రక్షించే స్వభావం కలది అమ్మ అని. అమ్మవారు తనను భక్తితో ధ్యానం చేసేవాడినీ, తాను రక్షిస్తున్నట్లు ఏ మాత్రం ప్రకటించ కుండా అతి రహస్యంగా రక్షిస్తుంది. ఆ రక్షణ' తనంత తానే వచ్చినట్లు మనకనిపిస్తుంది. కానీ రక్షించేది అమ్మవారే. తీవ్రమైన శత్రుబాధతో నలగిపోయేవారు, ఈ మంత్రాన్ని అమావాస్య, సంక్రాంతి గ్రహణ కాలంలో 1000 సార్లుకు తక్కువ కాకుండా జపిస్తే శత్రుపీడ తక్షణం తొలగి మనశ్శాంతి పొందుతారు. బాధ, మరీ ఎక్కువగా ఉంటే జపాన్ని ఇంకా ఎక్కువ చేయాలి. ముఖ్యంగా గ్రహణం పట్టినప్పుడు జపం ప్రారంభించి, విడిచిపెట్టే దాకా చేస్తే జీవితంలో శత్రుభయం ఉండదు.
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0043 నామం : కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత