శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0040 నామం : మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితా
"ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితాయై నమః"
ఇది పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితాయై నమః అని చెప్పాలి.
మాణిక్య = మాణిక్య సంబంధమైన,
మకుటాకార = కీరీటమువంటి ఆకారముతో ఒప్పు,
జానుద్వయ = మోకాళ్ళ జంటతో,
విరాజితా = ప్రకాశించునది.
ఒక పెద్ద మాణిక్యముతో ఒక మకుటాన్ని, అంటే కిరీటాన్ని (Crown) తయారుచేస్తే - ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోకాటి చిప్పలు ఆలా ఉంటాయట! అలంటి మోకాళ్ళతో అమ్మవారు అందంగా ఉన్నదని ఈ నామానికి అర్థం.
క్రిందటి నామంలోని 'ఊరుద్వయం' ఈ నామం లోని 'జానుద్వయం' ఈ రెండు గుహ్యమైనవే! ఈ రెంటిలో 'ఊరుద్వయం' గుహ్యతమం. అందుకే ప్రస్తుత నామంలోని జానువులకు మాణిక్య మకుట ఆకారన్ని ఉపమానంగా చెప్పి పూర్వపు ఊరుద్వయానికి విశేషణాలే చెప్పారు కానీ ఉపమానాలు చెప్పలేదు.
'మాణిక్యకిరీటాన్ని పోలిన మోకాలి చిప్పలు కలిగినది' అని ఈ నామానికి అర్థము.
మంత్ర ప్రయోగ ఫలితం
పోయిన వైభవాన్ని తిరిగి ప్రసాదించే దివ్య మంత్రం ఇది. తమకు పదవుల కావాలని కోరుకునేవారు 41 రోజులు అమ్మవారి పటానికి ఎదురుగా కూర్చుని, ఎఱ్ఱని పూలతో పూజిస్తూ, ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు జపిస్తే పదవి లభిస్తుంది. వైభవాలూ సంపదలూ లభించాలని కోరేవారు ఒక సంవత్సరకాలం పాటు రోజూ 27 సార్లు “ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజి తాయై నమః” అనే మంత్రాన్ని జపిస్తే సకల భోగభాగ్యాలూ లభిస్తాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0041 నామం : ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంఘికా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation