శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0040 నామం : మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితా
"ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితాయై నమః"
భాష్యం
ఇక్కడ మాణిక్యమకుటము అంటే అఖండ మాణిక్యేన నిర్మితం మకుటం అఖండమైన
మాణిక్యములతో నిర్మించినటువంటి మోకాలి చిప్పలతో ప్రకాశించునది.
ఆ పరమేశ్వరి మోకాళ్ళు మాణిక్యములు కూర్చబడిన కిరీటాలులాగా టోపీలు లాగా ఉన్నాయి. ఇక్కడ కిరీటములతో మోకాళ్ళను పోల్చటం జరిగింది. 89, 40 నామాలలో దేవి ఊరువులు జానువులను వర్ణించటం జరిగింది. ఈ రెండింటికీ సంధిస్థలము, కేంద్ర బిందువు రత్నమణి సంకేతము గలది. ఇది “కలికా” అనే సంజ్ఞతో చెప్పబడింది. దీని తత్త్వము రహస్యాతి రహస్యము. అవాజ్మనసగోచరము. దీన్ని తెలుసుకున్నవాడే సర్వజ్ఞుడు. ఈ కలిక ప్రకృతి రూపము. రక్తశుక్ల ప్రభామిశ్రము. చరణద్వయ సమిష్టిరూపము. ఆనందద్వైవిధ్యరూపము. ప్రణవద్వైవిధ్య రూపము కలాద్వైవిధ్య రూపము. శివశక్తిక
రూపము. సర్వతత్త్వసారము. సాధారణ మానవులు దీన్ని తెలియలేరు. సర్వవేద వేద్యుడయిన ఆ పరమేశ్వరుడికే ఈ రహస్యం తెలుసు. కలికా అనే ఆనంద స్వరూపాన్ని ఆనంద స్వరూపుడయిన కామేశ్వరుడికే తెలియుట సహజము. ఎందుకంటే తన స్వరూప స్వభావాలు తనకు తెలిసినట్లుగా ఇతరులకు తెలియవు.
మోకాళ్ళు కఠినములు కాబట్టి వాటిని మాణిక్యమకుటములతో పోల్చారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below