శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0039 నామం : కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా
"ఓం ఐం హ్రీం శ్రీం కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః"
ఇది పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః" అని చెప్పాలి.
కామ + ఈశ = కామేశ = కామేశ్వరునికి మాత్రమే,
జ్ఞాత = తెలిసిన,
సౌభాగ్య = సౌభాగ్యవంతమైన,
మార్దవ =మెత్తని లేదా మృదువైన, ఊరుద్వయ = తొడల జంటను,
అన్విత = కూడినది.
కామేశ్వర పదం ఎప్పుడు వచ్చిన సృష్టి సంకల్పం కలిగిన శివునిగా చెప్పుకోవాలి. "సోకామాయత బహుస్యాం ప్రజాయేయేతి" అన్నది శ్రుతి వాక్యం. ఒంటిగింటి రామలింగం లాగా ఉన్న పరమేశ్వరునికి ఓ కోరిక కలిగిందట. ఒంటరిగా, ఒక్కడుగా ఉన్నతాను - ఎక్కువమందిగా అవ్వాలనేదే - ఆ కోరిక. ఆ కోరిక ఫలితంగానే యావత్ ప్రపంచం వ్యక్తమైంది. ఇలా ఎక్కువ మందిగా అవ్వాలనే కోరిక (కామం) నిండుగా ఉన్న స్థితిలోని పరమేశ్వరుణ్ణి "కామేశ్వరుడు" అంటారు. అందుకు సహకరించిన ఆయన శక్తిని 'మహాకామేశ్వరి' అంటారు.
మహాకామేశ్వరియే అమ్మవారు. ఈ అమ్మవారిని కేశాది నాభి పర్యంతం ఇంతకూ పూర్వం వర్ణించటం జరిగినది. నాభివరకు ఉన్న అవయవాలన్నిటికి - ఉపమానాలు చెప్పినా, ప్రస్తుత నామం విషయం లో ఉపమానం చెప్పలేదు. ఆలా చెప్పక పోవడంలోనే వుంది ఔచిత్యమంతా! కేవలము సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువులు అమ్మవారివి. అందుచేత ఉపమానాలు వేయకుండా ముక్తసరిగా "లావణ్యము, లాలిత్యముతో కూడిన సౌభాగ్యవంతమైన- అనే విశేషణాలే వేసి కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువులు" అని ఊరుకున్నారు వ్యాసమహర్షి.
రాశి చక్రంలో 9వ రాశి అయిన ధనుస్సు - 'తొడలను' , 'ఉపదేశాన్ని' గూడ సూచిస్తుంది. విద్యా శిక్షణలో సాధారణంగా మనం వినే 'తొడపాశం', 'చెవిమెలిపెట్టడం' లాంటి మాటలు ఉపదేశానికి సంకేత పదబంధాలుగా అర్థం చేసుకోవాలి. 'అమ్మవారికి సంబందించిన 'సౌభాగ్య' 'మార్దవ' మంత్రోపదేశాలు, వాటి సమన్వయం అయ్యవారికే తెలుసు' అనే సూచన ఈ నామం లో ఉంది.
మంత్ర ప్రయోగ ఫలితం
ఋణాను బంధరూపేణా పశుపత్నీ సుతాలయాః - అనేది నానుడి. పశువులు, భార్య, పిల్లలు, ఇళ్ళు ఋణానుబంధం ఉంటేనే లభిస్తాయి. అది లేక సంతానం కోసం అలమటించి పోయే వారికి ఈ మంత్రం తారకమే. మూడు నెలల పాటు ఆవు పాల నుండి తీసిన వెన్న అమ్మవారి పటానికి నివేదన చేస్తూ, రోజూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపంచెయ్యాలి. జపం అయ్యాక వెన్నను భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరో, లేక ఇద్దరో తినాలి. భక్తిశ్రద్దలను బట్టి చాలా తొందరగా ఈ మంత్ర ప్రభావంతో సంతానం కలుగుతుంది. శీఘ్ర ఫలితానికి జపాన్ని పెంచి 1000 సార్లు చేసుకోవాలి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0040 నామం : మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation