శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0037 నామం : అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ
"ఓం ఐం హ్రీం శ్రీం అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటియై నమః"
ఎఱ్ఱని వస్త్రమును కటి ప్రదేశమున ధరించిన దేవియని భావము. అరుణారుణము అనగా ఎఱ్ఱని ఎరుపు అని అర్థము. ఇది సూర్యుడు ఉదయించినపుడు ఆకాశమున మరియు సూర్యభింబమున కనపడు ఎరుపు. కౌస్తుంభ మనగా కుంకుమ పువ్వు రంగు. అట్టి రంగుతో వెలుగొందుచున్న వస్త్రమును కటి ప్రదేశమున ధరించినది. ఎరుపురంగు ఇచ్చాశక్తి స్వరూపము. అందుండియే జ్ఞాన క్రియ శక్తులు కూడా క్రమశః ఉద్భవించగలవు. అమ్మ తిరుగులేని సంకల్ప శక్తీ కలది. సంకల్పబలము దృఢముగా ఏర్పడవలేనన్నచో ఉపాసకులు ఈ అరుణారుణ వర్ణమును బాగుగా ధ్యానము చేయవలసి యుండును. ఈ రంగు మనస్సునందు అపవిత్రమును దగ్ధము చేయగలదు. ఇంద్రియ ప్రవృత్తులను నిర్ధేశము చేసి నియమించగలదు. జీవునకు అమితమైన సంకల్పశక్తిని ప్రసాదించగలదు. కావుననే అమ్మవారికి కుంకుమతో పూజ చేయుట. ఎరుపు రంగు తిలకము ధరించుట... ఎర్రటి వస్త్రములు భక్తులు దేవీ ఉపాసన సమయంలో ధరించుటకు కూడా ఇదియే కారణం యూనిఫామ్ అనేది ఒక క్రమశిక్షణ ఒక గుర్తింపు ఒక వర్గానికి ప్రత్యేకమైనదిగా కూడా గుర్తింపు నిస్తుంది. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ రంగు వస్త్రములు సాధకులు ధరించడం వల్ల వారికి మరింతగా ఏకాగ్రతగా ధ్యానం చేయడం మనము అమ్మవారి సమూహము అన్న భావన కలుగుతుంది.
మంత్ర ప్రయోగ ఫలితం
అమ్మ గ్రహాది రూపిణి కనుక గ్రహదోష నివారణకు కూడా అమ్మనే స్మరించే గ్రహపీడను తట్టు కోలేనివారు శనివారం ఈ మంత్రాన్ని ఒకే ఆసనంపై కూర్చుని 108 సార్లు జపించాలి. మంచి వస్త్రాలు కావాలని కోరుకొనేవారు ఈ మంత్రాన్ని మంగళ, సోమ వారాలలో 108సార్లు జపించాలి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0038 నామం : రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation