శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0037 నామం : అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ
"ఓం ఐం హ్రీం శ్రీం అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటియై నమః"
భాష్యం
అరుణము అంటే ఎరుపు. రక్త వర్ణము. అరుణారుణము అంటే ఎరుపు అనే మాటను రెండుసార్లు చెప్పటం జరిగింది. అనగా అరుణ వర్ణము మరింత అరుణంగా ఉన్నది. మిక్కిలి ఎర్రనైన. అనూరుని లాగా ఎర్రదైన వస్త్రముచే ప్రకాశించు కటి ప్రదేశము గలది. ఆ పరమేశ్వరి ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని కాంతులతో ప్రకాశించునది.
బాలబానునివలె అరుణ వర్ణము గలది. బంగారుచ్చాయవంటి కౌసుంభచ్చాయ గల వస్త్రముతో ప్రకాశించునది.
అరుణము అంటే సూర్యోదయానికి ముందున్న కాంతి. అరుణుడు లేక అనూరుడు ఉదయించే సమయంలోని కాంతి. కొద్దిగా ఎరుపు రంగులో ఉంటుంది. తెలుపుతో కలిసిన ఎరుపు. పాటలవర్ణము.
కౌసుంభము అంటే కుంకుమపువ్వు. అరుణుని యొక్క వర్ణము, కౌసుంభ పుష్పముయొక్క వర్ణముగల వస్త్రమును ధరించినది.
దేవి ఎరుపురంగులో ఉంటుంది. ఎర్రని వస్త్రాలు, ఎర్రని పూలమాలలనే ధరిస్తుంది. ఆమె పూజ కూడా రక్తాక్షతల (ఎర్రని అక్షంతలు) తోనే చెయ్యాలి. ఇది కామ్యము.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below