శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0036 నామం : స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా
"ఓం ఐం హ్రీం శ్రీం స్తనభారదళన్మధ్య పట్టబంధవళి త్రయాయై నమః"
స్థనముల బరువుచే వీగుచున్న నడుమునకు దృఢము కలిగించుటకు మూడువరుసల బంగారు పట్టికచే చుట్టబడిన సన్నని నడుముకలది శ్రీదేవి అని భావము. నడుమును గురించి ముందు నామములో తెలియచేయబడినది. నడుము చుట్టును ఏర్పడిన మూడు భౌతిక లోకములు, మూడు కాలములను ఈ నామము సూచించును. ఇక్కడ చెప్పబడిన మూడు లోకములు మణిపూరకము, స్వాధిష్ఠానము, మూలాధారమునకు సంబంధించినవి. ఇవియే త్రిగుణములు. వీటియందే సమస్త జీవులను శ్రీదేవి తన మాయచే బందించి ఉంచును. మనస్సు, ఇంద్రియములు, భౌతిక శరీరము - ఈ త్రివళుల కారణముగా ఏర్పడి జీవునకు ఉపాధి ఏర్పడును. అజ్ఞానము కారణముగా అవి బంధహేతువులగును. జ్ఞానము సిద్ధించినచో ఈ ఉపాధులు వైభవ కారకములు అగును. శ్రీదేవి నడుముచుట్టును ఉన్న ఈ మూడు వరుసల బంగారుపట్టీని ధ్యానము చేసినవారికి అమ్మయే బంధములను సడలించును.
మంత్ర ప్రయోగ ఫలితం
భరింపలేని దుఃఖం కలిగినపుడు, “ఓం ఐం హ్రీం శ్రీం స్తనభారదళన్మధ్య పట్టబంధవళి త్రయాయై నమః" అనబడే ఈ మంత్రాన్ని ఎడతెరిపి లేకుండా జపిస్తే ఆ తీవ్ర దుఃఖం నశిస్తుంది. సౌఖ్యం లభిస్తుంది. అనారోగ్యం మరీ ఎక్కువయిపోయినప్పుడు, ఈ మంత్రాన్ని పరమభక్తితో సూర్యునకు ఎదురుగా నిలబడి, లేక కూర్చుని, ఉదయం 8 గంటల లోపు 1000 సార్లు జపించాలి ఆరోగ్యం లభిస్తుంది. కాలంవల్ల వచ్చే శారీరక మానసిక బాధలకు ఈ మంత్రాన్ని నిత్యం 11 సార్లు జపిస్తే, బాధల ఉధృతి తగ్గుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0037 నామం : అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation