శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0036 నామం : స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా
"ఓం ఐం హ్రీం శ్రీం స్తనభారదళన్మధ్య పట్టబంధవళి త్రయాయై నమః "
భాష్యం
పరమేశ్వరి నడుము చుట్టూ మూడు ముడతలు కనిపిస్తున్నాయి. అవి ఆమె స్తనముల యొక్క భారముచే వంగిన నడుముకు చుట్టూ వేసిన మూడు బంగారు కట్లుగా కనిపిస్తాయి.
పరమేశ్వరి నడుము సన్ననిది. అందులోనూ స్తనభారంచేత బాగా వంగి విరిగిపోతుందేమో అనే భయంతో ఆ నడుముచుట్టూ కట్లు బిగించారా అనట్లుగా ఆ ముడుతలు ఉన్నాయి.
దేవిస్తనాలు సూర్యచంద్రులు. అవి పగలు రాత్రి అనే భేదంతో కాలాన్ని తెలుపు తున్నాయి. ఒక పగలు, ఒక రాత్రి కలిపితే ఒకరోజు. ముఫ్పె రోజులు ఒక నెల. ఈ రకంగా కాలం లెక్కకట్టబడింది. కాలాన్ని భరించేది దేవి. ఆమె కాలస్వరూపిణి. కాలములు మూడు. అవి భూత భవిష్యద్వర్తమానాలు. కాని ఆ పరమేశ్వరి మాత్రం కాలాతీత. సాముద్రిక శాస్త్ర ప్రకారం.
లలాటే చ గళే చైవ మధ్యే చాపి వళిత్రయమ్ ।
క్రీపుంసయో రిదం జ్ఞేయం మహాసౌభాగ్య లక్షణమ్ ॥
లలాటమందు, కంఠస్థానమందు, నడుమునందు మూడు ముడతలుండటమనేది సౌభాగ్య లక్షణము. పరమేశ్వరుడికి రూపం లేదు. కాని
సాధకానాం హితార్థాయ బ్రహ్మణోరూప కల్పనా ॥
సాధకుని యొక్క కోరిక తీరటం కోసం, అతనికి కావలసిన రూపం ఆ బ్రహ్మకు కల్పించబడింది. అప్పుడు అన్ని శుభలక్షణాలు ఆ బ్రహ్మరూపానికి ఆపాదింపబడతాయి. అదే విధంగా పరమేశ్వరికి లలాటము కంఠము, నడుము, వళిత్రయము మొదలైనవన్నీ సాముద్రిక శాస్త్ర ప్రకారం చెప్పబడ్డాయి.
నడుము చుట్టూ ఉన్న ఆ మూడు ముడుతలే స్థూల సూక్ష్మ కారణదేహాలు. సత్వరజస్తమో గుణాలు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు, బ్రహ్మ, విష్ణు, రుద్రులు, భూలోక, భువర్లోక, సువర్లోకాలు.
సౌందర్య లహరిలోని 80వ శ్లోకంలో శంకరభగవత్సాదులవారు వళిత్రయాన్ని వర్ణిస్తూ
కుచౌ సద్య స్స్విద్య - త్తటఘటితకూర్పాసభిదురౌ
కషంతౌ దోర్మూలే - కనకకలశాభౌ కలయతా|
తవ త్రాతుం భంగా - దలమితి వలగ్నం తనుభవా
త్రిధా నద్ధం దేవి - త్రివళిలవలీవల్లిభి రివ ||80||
దేవీ ! సన్ననైన నీ నడుముకు అపాయం కలుగకుండా అడవి తీగెలతో మూడు కట్లు వేశారు అన్నట్లుగా ఆ వళిత్రయం కనిపిస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below