శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0035 నామం : లక్ష్య రోమలతాధారతా సమున్నేయమధ్యమా
"ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్యరోమ లతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః"
కాంతిచే చూడదగిన నూగారు తీగకు ఆధారమగుటచే ఊహింపదగిన నడుముకలది. అనగా నడుము ఉన్నదా? లేదా? అన్న సందేహము కలిగి, అచట పుట్టిన నూగారుచే నడుము కలదని ఊహింపబడుచున్నది. శ్రీదేవి నడుము మిక్కిలి సూక్ష్మమైనదని, చర్మచక్షువులకు గోచరము కానిదని, మాయాతీతమైనదని తెలియవలెను. కనబడుచున్న సృష్టికి, కనపడని సూక్ష్మ సృష్టి ఆధారము. ఆకాశము నుండి పంచభూతముల సృష్టి దృగ్గోచరము. దానికి వెనుక గల సూక్ష్మ లోకములో అగుపడనివి. అగుపడనిది, అగుపడు సృష్టికి ఆధారము. శ్రీదేవి నడుము పై భాగమంతయు అదృశ్యము, దివ్యము, అమృతమయమగు లోకములుగా తెలియదగును. నడుము క్రిందిభాగము నుండి దృగ్గోచర లోకములు కలవని తెలియవలెను. సూక్ష్మబుద్ధికే ఈ లోకములు తెలియబడ గలవని తెలుపుటకు సూక్ష్మమైన (నూనూగు) రోమములు పంక్తికి ఆధారముగ నడుము కలదని చెప్పుట. తెలిసిన దానినుండి తెలియని దానికి ప్రయత్నించుట. పరిమితమైన మనస్సుతో అపరిమితమైన దైవమును తెలియగోరుట ఆరోహణక్రమము (తక్కువ నుంచి ఎక్కువకు). ఈ సూక్ష్మమునకు సంబంధించిన ఆరోహణ క్రమమునకు నూగారు లత లేక తీగ ఉదహరింపబడినది.
మంత్ర ప్రయోగ ఫలితం
సృష్టికి సంబంధించిన విషయాలను పరిశీలించే శాస్త్రం విజ్ఞానశాస్త్రం. విజ్ఞాన శాస్త్రంలో తిరుగులేని పాండిత్యం, విజయం కావాలనుకొనేవారు ఈ మంత్రాన్ని సోమ, గురువారాలలో ఉదయం, రాత్రి 108 సార్లు చేసుకోవాలి. మహా వైజ్ఞానికుడు అవుతాడు సాధకుడు. గణితశాస్త్ర పాండిత్యానికి శనివారం ఈ మంత్రాన్ని 108 సార్లు అనుష్టానం చేయాలి. జ్యోతిష పాండిత్యం పొందాలను కొనేవారు ఆదివారం ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించాలి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0036 నామం : స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation