శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0035 నామం : లక్ష్య రోమలతాధారతా సమున్నేయమధ్యమా
"ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్యరోమ లతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః "
భాష్యం
కంటిచే చూడతగిన నూగారుతీగెకు ఆధారం కావటంచేత అక్కడ నడుము ఉన్నది. అని ఊహించటం జరుగుతున్నది. అంటే పరమేశ్వరి యొక్క నడుము చాలా చిన్ననైనదని అర్థము. అజ్ఞానులకు ఆధారభూతమై మాయాతీతమైనది.
కనిపించీ కనుపించనట్లుండి రోమావళి లత మాత్రంచేత ఊహింపదగిన శరీర మధ్యభాగము గలది. ఆధారం లేకుండా తీగె ఉండదు. అనే ప్రమాణాన్ని తీసుకుని, లతకు ఆధారం నాభి. నాభికి స్థానమైన మధ్యభాగము అనగా నడుము ఉండి ఉంటుందని ఊహించటం జరుగుతోంది. పరమేశ్వరి నడుము అతిసన్నగా ఉన్నది అని చెప్పటం.
స్త్రీలకు సన్నని నడుము ఉండటమనేది సాముద్రిక లక్షణం. శుభప్రదం. పరమేశ్వరి నడుము ఊహించటానికి వీలు లేనంత సన్నగా ఉన్నది. శంకరభగవత్సాదులవారు తమ సౌందర్య లహరిలోని 7వ శ్లోకంలో
క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరశ్చంద్రవదనా
దేవి నడుము అతిసన్నగా ఉన్నది. అందుకే సింహమధ్య. సింహమువలె సన్నని నడుము గలది. అని చెప్పబడింది. సౌందర్య లహరిలోని 79వ శ్లోకంలో శంకర భగవత్పాదులవారు దేవి నడుమును వర్ణిస్తూ
నిసర్గ-క్షీణస్య స్తనతట-భరేణ క్లమజుషో
నమన్మూర్తే ర్నారీతిలక శనకై-స్త్రుట్యత ఇవ |
చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ-తీర-తరుణా
సమావస్థా-స్థేమ్నో భవతు కుశలం శైలతనయే || 79
ఓ దేవీ ! స్వభావంచేత కృసించినది, పాలిండ్ల భారంచేత వంగినది, మెల్లగా తెగిపోతున్న నదిగట్టులా ఉన్నది అయిన నీ నడుముకు చిరకాలము శుభము జరుగుగాక.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below