శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0034 నామం : నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ
"ఓం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయై నమః"
నాభి అనగా బొడ్డు. దీనిని పాదుగా అనగా ఆధారంగా చేసుకొని పైకి పాకుతున్న లత(తీగ)లా ఉందట సన్నని వెండ్రుగలబారు. సహజంగా బొడ్డు నుండి సన్నని వెండ్రుగల బారు ఉంటుంది స్త్రీలకు. అదే ఒక లత. లతకు కాసిన రెండు ఫలాలు అన్నట్లు అమ్మవారి స్తనాలు కనబడుతున్నాయి. సకల ప్రాణుల ప్రాణాలు నిలబెట్టడానికి అమ్మవారు రెండు ఫలాలను ధరించినట్లుగా శౌనకుడు వర్ణిస్తాడు. ఇవి సాధారణంగా భూమిపై పుట్టి, ప్రాకే, లతలనిచ్చే ఫలాలు కావు. అజ్ఞానంలో పడి క్షణకాలంలో నశించిపోయే శరీరాన్ని నమ్ముకొని, చేయరాని పనులు చేస్తూ అహంకార మమకారాలతో కొట్టుమిట్టాడే జీవులను ఉద్ధరించే ఫలాలు అమ్మవారి పవిత్ర స్తనాలు. ఆతల్లి స్తన్యం అనగా చనుబాలు త్రాగే భాగ్యం కలిగితే పునర్జన్మ ఉండదు. సంసార సంబంధ ఘోరదుఃఖాలు ఉండవు. శోకానికి మూలకారణం అజ్ఞానం. అజ్ఞానం ఆత్మస్థైర్యం లేకుండా చేసి మనిషిని శోకసాగరంలో ముంచి చివరకు నశింపజేస్తుంది. దానిని విజ్ఞాన దృష్టితో విడిచిపెట్టడానికి శ్రీ మాతృస్తన్యం స్వీకరించాలి.
మంత్ర ప్రయోగ ఫలితం
అది అంత సులభం కాదు కనుక "ఓం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయై నమః" అనే మంత్రాన్ని భక్తితో రోజూ 9 సార్లు జపిస్తే అమ్మవారిపాలు త్రాగి పెరిగిన వానికి ఉండే పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం వలన జీవితంలో దుఃఖం రాదు. కష్టాలు మరీ ఎక్కువగా ఉండి దిక్కుతోచక ఆత్మహత్యే శరణ్యం అని భావించే వారికి ఈమంత్రం తారక మంత్రం. 41 రోజులు ఈమంత్రాన్ని రోజుకి 108 సార్లు రాత్రి పడుకోబోయే ముందు జపిస్తే పైన పేర్కొన్న భయంకర దుఃఖాలు, కష్టాలు నశిస్తాయి. శత్రువుల బాధ మరీ ఎక్కువగా ఉన్నవారు మధ్యాహ్నం పూట కూడా 108 సార్లు జపించడం మంచిది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0035 నామం : లక్ష్య రోమలతాధారతా సమున్నేయమధ్యమా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation