లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0033 నామం : కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ
కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ : కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి గొప్పదైన(= రత్న) మణిని పొందుటకై స్తనములను బదులుగా ఇచ్చు తల్లికి నమస్కారము.
విశేషాలు : రత్నమంటే రెండు అర్థాలు.
౧. శ్రేష్ఠమైనది అని ఒక అర్థము.
౨. నవరత్నములలోని రత్నమని రెండవ అర్థము. :- మౌక్తికము, పద్మరాగము, వజ్రము ప్రవాళము మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.
Kaameshwara Prema Rathna Mani Prathipana Sthanee : She who gave her breasts made of Ratna (Precious stones) in lieu of the love of Kaameshwara’s love ratna. Salutations to the mother.