శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0033 నామం : కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ
"ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తన్యై నమః"
భాష్యం
ఈ నామంలో రెండు రకాలయిన రత్నాలున్నాయి. 1. ప్రేమ రత్నము 2. స్తనమణి
ఆ కామేశ్వరి కామేశ్వరుని ప్రేమ అనే రత్నన్ని, స్తనద్వయము అనే రెండు మణులను
ప్రతిఫలంగా ఇచ్చికొన్నదట.
ఏదైనా వస్తువు చౌకగా దొరికితే దానిమీద శ్రద్ధ ఉండదు. వస్తువును అసలు ధరకే
కొన్నప్పటికీ అది దొరకటం లేదు అని తెలిస్తే దానిమీద శ్రద్ధ పెరుగుతుంది. అదే
వస్తువుని అసలు ధరకన్నా ఎక్కువకి కొంటే దానిమీద శ్రద్ధ మరీ పెరుగుతుంది. వస్తువుని
రెండు రెట్లు ధర ఇచ్చికొంటే దానిమీద భక్తి శ్రద్ధలు మరీ పెరుగుతాయి. ఇక్కడ కామేశ్వరుని
ప్రేమ అనేది ఒక మణి. మణికి మణి సమమూల్యమవుతుంది. కాని పరమేశ్వరి స్తనమణులు రెండింటిని ప్రతిఫలంగా ఇచ్చి ప్రేమమణిని కొన్నది. రెండు రెట్లు ధర
చెల్లించింది కాబట్టి ఆ దేవదేవుని ప్రేమమీద ఆమెకు అత్యంత శ్రద్ధ ఉంటుంది. ఇది
పతివ్రతా లక్షణము.
పార్వతీ పరమేశ్వరులు. వారే శివశక్తులు. జగత్తులోని స్త్రీ పురుషులకు ప్రతీకలు.
పురుషుడు జన్మించిన తరువాత తల్లితండ్రుల ఆధ్వర్యంలో విద్యావంతుడయి, యవ్వనంలో
వ్యక్తిత్వాన్ని సముపార్టించుకుని, పూర్వజన్మలో సంబంధం గల స్త్రీని వెతికి వివాహం
చేసుకుంటాడు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి. అంటే ధర్మార్థ
కామమోక్షాలలో నేను ఆ స్త్రీతో కలిసే చరిస్తాను. అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడు.
ఈ రకంగా వివాహమాడిన స్త్రీ అతనికి సహధర్మచారిణి అవుతుంది. అలాగే స్త్రీ కూడా
తన భర్తయొక్క సల్లాప, సంస్పర్శ, సంశ్లేష సంయోగాలవల్ల తనకు లభించిన జ్ఞానంతో
సంతానాభివృద్ధి ద్వారా వంశాన్ని వృద్ధి చేస్తుంది. భర్త యొక్క విద్యా విజ్ఞానాలను, తన
స్తన్యము ద్వారా బిడ్డకు అందచేస్తుంది. ఇక్కడ 'ప్రతిఫణస్తనీ” అన్న మాటకు అర్ధం ఇది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below