శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0032 నామం : రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా
"ఓం రత్నాగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః"
రత్నతాపడం చేయబడిన ఒకానొక ఆభరణాన్ని కంఠంలో ధరించింది అమ్మవారు. దీనిని కంఠాభరణం లేక గ్రైవేయహారం అంటారు. చింతాక అనే పేరు గలిగిన మరొక పతకాన్ని కూడా అమ్మవారు ధరించింది. తెలియక కొందఱు దీనిని చింతాకుపతకం అని తప్పుగా అంటారు. కానీ చింతాక పతకం. ఈ పతకానికి ముత్యాలు వ్రేలాడుతూ మువ్వలవలె కదులుతూ ఉంటాయి. ఇది సాధారణంగా స్త్రీలే ధరిస్తూ ఉంటారు. "సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము రామచంద్ర" అని కంచర్ల గోపన్న(రామదాసు) పాడిన పాట ఈ పతకం గురించే. రత్నముత్య సువర్ణ కంఠాభరణం ధరించే తల్లిని ధ్యానిస్తే అన్ని రకాల కోరికలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. చింతాకుపతకం ధరించినప్పుడు లోకుల శోకాలన్నీ తానే స్వీకరిస్తానని, దానికి బదులుగా వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తానని అమ్మవారన్నది.
మంత్ర ప్రయోగ ఫలితం
"ఓం రత్నాగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః"
కోర్కెలు ఉన్నంతకాలం శోకం తప్పదు. శోకం వాళ్ళ అశాంతి. అశాంతివల్ల జన్మలు తప్పవు. కాబట్టి కోరికలే లేని జ్ఞానావస్థను కలిగించేది చింతాక పతకం. అందువల్ల ఈ నామమంత్రం సంపూర్ణ వస్తుదాయకం. మోక్షదాయకం. వాహనాలు కావాలనే కోరిక ఉన్నవారు 18 శుక్ర వారాలు ఈమంత్రాన్ని 108 సార్లు జపించాలి. సువర్ణ వస్తువులు కావాలనుకేవారు 41 రోజులు రోజూ 108 సార్లు జపించాలి. ఆహారవస్తువులకు మంగళవారం నాడు 1008 సార్లు జపం చేయాలి. మోక్షాసక్తి ఉన్నవారు వీలున్నప్పుడల్లా జపించాలి, పిల్లలు కావాలనుకునేవారు ఏడాది పాటు రోజు ఆవుపాలు అమ్మవారికి నివేదిస్తూ, ఆ ఆవుపాలు ప్రసాదంగా దంపతులు మాత్రమే స్వీకరిస్తూ రోజు 108 సార్లు జపించాలి.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0033 నామం : కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation