శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0031 నామం : కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా
"ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః"
అంగదములు అనగా గుండ్రంగా ఉండి నవరత్నాలు తాపడం చేయబడిన భుజాలకు ధరించే ఆభరణాలు. కేయూరాలు అనగా వంకీలు. ఇవి కూడా భుజకీర్తులే. ఆకారాలు తేడాగా ఉండడం వాళ్ళ అంగదాలు, కేయూరాలు అంటున్నాము గాని ఈరెండు భుజాలకు ధరించే ఆభరణాలే. బంగారంతో తయారు చేయబడిన అంగదాలు, కేయూరాలు అనబడే ఆభరణాలతో కమనీయంగా కనిపిస్తున్న భుజాలతో కూడినది అమ్మవారు. అసలే అమ్మవారి శరీరం అరుణవర్ణంలో ప్రకాశిస్తోంది. ఆపై ఆ శరీరానికి ఆభరణాలు వన్నె చేకూరుస్తున్నాయి. ఈ ఆభరణాలు అగ్ని స్వరూపమని, వీటి ధ్యానం వలన వైశ్వానరుడనబడే అగ్ని, మన శరీరంలో సక్రమంగా పనిచేసి జీర్ణశక్తి అభివృద్ధి చేస్తాడని తాంత్రికులు చెబుతుంటారు. "అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాప్రాణ సంయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్" అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో, తానే వైశ్వానరుడనే పేరుతొ ప్రాణుల శరీరంలో ఉండి చతుర్విధాహారాలను జీర్ణం చేస్తుంటాడు.
మంత్రప్రయోగం ఫలితం
ఈ శ్రీకృష్ణుడు అమ్మవారికి అంగద కేయూరాలుగా శోభిస్తున్నాడు. కాబట్టి ఈమంత్రాన్ని భక్తితో రోజూ 36 సార్లు జపిస్తే జీర్ణశక్తి అవుతుంది. చేతులు, భుజాలు నొప్పిగా ఉండి కదల్చడం కష్టమౌతుంది కొందరికి. మరొకొందరికి మోచేతులలోని కీళ్లు పనిచేయవు. ఇటువంటివారు ఈ మంత్రోచ్చారణ రోజుకు 27 సార్లు చేస్తే ఆయా రోగాలు నయమౌతాయి
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0032 నామం : రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation